రూ. 12 లక్షల వరకూ No Income Tax, కొత్త పన్ను శ్లాబులు ఇవే...

ఠాగూర్

శనివారం, 1 ఫిబ్రవరి 2025 (12:30 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు శుభవార్త  చెప్పారు. రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆదాయపన్ను విధానంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ మేరకు శనివారం కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టారు.
 
కొత్త పన్ను శ్లాబులను ప్రకటించారు. పన్ను చెల్లింపుల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు. అలాగే, మధ్యతరగతి ప్రజలు రూ.12 లక్షలకు వరకు ఆదాయం ఉంటే ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదని తెలిపింది. రూ.12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదు. ఆ తర్వాత ఆదాయాన్ని చెల్లించాల్సిన పన్నును వివిధ శ్లాబులుగా విభజించారు.
 
అలాగే, కొత్తగా తీసుకొచ్చిన  పన్ను శ్లాబులు సవరణ
రూ.0-4 లక్షలు - సున్నా
రూ.4-8 లక్షలు - 5 శాతం 
రూ.8-12 లక్షలు - 10 శాతం
రూ.12-16 లక్షలు - 15 శాతం
రూ.16-20 లక్షలు - 20 శాతం
రూ.20-24 లక్షలు - 25 శాతం
రూ.24 లక్షల పైన 30 శాతం 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు