ఇదేవిధంగా పేద రైతుల ఆదాయం పెంపుకు చర్యలు చేపట్టామని గోయెల్ తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏడాది రూ.6వేలు అందిస్తాం. 2 హెక్టార్ల లోపల(5 ఎకరాలు) వ్యవసాయ భూమి ఉన్న రైతులు కొత్త పథకంలో లబ్ధి పొందనున్నారు. మూడు దఫాలుగా ఈ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. దీని ద్వారా 12కోట్లమంది రైతులు లబ్ధి పొందుతారు.