దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు నగరాల్లో సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు పెంచామని, బుధవారం (అక్టోబర్ 13) ఉదయం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని ఐజీఎల్ తెలిపింది. సీఎన్‌జీపై ఒక కిలోకు రూ .2.28 , సీఎన్‌జీపై క్యూబిక్ మీటరుకు రూ.2.10 పెంచారు.
సవరణ తర్వాత ఢిల్లీలో సీఎన్‌జీ గ్యాస్ ధర కిలోకు 49.76లు ఉంది. నోయిడాలో కిలో రూ.56.02, గురుగ్రామ్‌లో రూ.58.20, రేవారి రూ.58.90, కైతల్ రూ.57.10, ముజఫర్‌నగర్, మీరట్, షామ్లీ రూ.63.28, ఫతేపూర్, హమీర్‌పూర్ రూ.66.54, అజ్మీర్, పాలి, రాజసమంద్ కిలోకు రూ. 65.02గా ఉంది. పైప్ లైన్ ద్వారా సరఫరా చేసే గ్యాస్ సీఎన్‌జీ ధరను క్యూబిక్ మీటరుపై రూ.2.10 పెరిగింది.