మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు-రూ.110.63గా..?

మంగళవారం, 12 అక్టోబరు 2021 (17:19 IST)
దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం నాడు మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. కొన్ని చోట్ల లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110 దాటుతుంది. విజయవాడలో పెట్రోల్‌ ధర ప్రస్తుతం రూ.110.63 గా ఉంది. పెట్రోల్‌ ధర ఈరోజు రూ.0.24 పైసలు పెరిగింది. డీజిల్‌ ధర రూ.0.31 పైసలు పెరిగి రూ.103.05కు చేరింది. గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. 
 
ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెట్రోల్‌ ధరలు తగ్గలేదు. పైగా సెస్‌ రూపంలో కేంద్రం పన్నులను పెంచుతోంది. మోడీ ప్రభుత్వం దసరా కానుకగా గ్యాస్‌ ధరను రూ.25 పెంచిందని... అలాగే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా రోజూ పెంచుతున్నారని సోషల్‌ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు