దేశంలో ఒకపైవు పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు, గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు షాకిచ్చాయి. దసరా పండుగ ముందు వంట గ్యాస్ మంటపెట్టారు. గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెంచేశారు.
ఢిల్లీలో సబ్సిడీ లేకుండా 14.2 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు రూ.899.50కి పెరిగింది. కోల్‌కతాలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.911 నుంచి రూ.926కి, ముంబైలో రూ.844.50 నుండి రూ.899.50కి పెరిగింది. చెన్నైలో సబ్సిడీయేతర సిలిండర్ ధర ఇప్పుడు రూ.915.50.
ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ ధర రూ.1736.5. కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1805.5. ముంబైలో రూ.1685, చెన్నైలో రూ.1867.50గా ఉంది. సహజ వాయువు ధరల పెరుగుదల కారణంగా సీఎన్జీ, జీఎన్జీ వంట గ్యాస్ ధరలు పెరిగాయి.