వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ధర

మంగళవారం, 4 జులై 2023 (14:15 IST)
దేశంలో మరోమారు గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. గృహ వినియోగదారులకు సరఫరా చేసే వంట గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ, వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలో మాత్రం ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెంచాయి. ప్రతి నెల ఒకటో తేదీన చేపట్టే ధరల పునఃసమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఒక్కో వాణిజ్య సిలిండర్ ధరపై రూ.7 మేరకు పెంచింది. దీంతో 19 కేజీల కమర్షియల్ వాణిజ్య సిలిండర్ ధర రూ.1780కి చేరింది. ఇది మూడు నెలల క్రితం గరిష్ట ధరకు చేరుకుంది. 
 
కాగా, గత మే నెలలో వాణిజ్య అవరాల సిలిండర్ ధరను రూ.171.50 మేరకు తగ్గించారు. దీంతో ఈ సిలిండర్ ధర రూ.2028 నుంచి రూ.1856కు దిగివచ్చింది. ఏప్రిల్ నలలో రూ.91 మేరకు తగ్గించింది. అయితే, ఇపుడు రూ.7 మేరకు పెరగడంతో ఈ ధర రూ.1780కి చేరింది. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1103కు చేరింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర మార్చి ఒకటో తేదీన రూ.50న పెరగ్గా అప్పటి నుంచి స్థిరంగా ఉంటూ వచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు