ఇదిలావుంటే, ఏడాది మే, జూలై మధ్య లీటర్ పెట్రోల్‌పై చమురు కంపెనీలు రూ.11.52 వరకు బాదాయి మార్చి, ఏప్రిల్‌లు తమిళనాడు, బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. మే 4 ఫలితాలు వెలువడిన తర్వాత పెట్రోల్ ధరల బాదుడు మొదలైంది.
ఏకంగా 42 రోజుల పాటు ధరలను పెంచారు. ఫలితంగా లీటర్‌పై రూ.11.52, డీజిల్‌పై 41 రోజుల్లో లీటర్‌పై 9.08 చొప్పున పెంచేశాయి. అయితే, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా హర్దీప్ సింగ్ పూరి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ధరలు జూలై 18 నుంచి స్థిరంగా కొనసాగుతూ వచ్చాయి. ఈ నెల 22న పెట్రోల్ ధరపై 20 పైసలు తగ్గగా.. తాజాగా మరోసారి 15 పైసలు వరకు తగ్గింది. డీజిల్ ధర ఈ నెల 18, 20 తేదీల్లో 20 పైసల చొప్పున తగ్గుదల నమోదైంది.
దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పెట్రోలు ధరల వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలో పెట్రోల్ రూ.101.49.. డీజిల్ రూ.88.92, ముంబైలో పెట్రోల్ రూ.107.52.. డీజిల్ రూ.96.48, చెన్నైలో పెట్రోల్ రూ.99.20.. డీజిల్ రూ.93.52, కోల్‌కతాలో పెట్రోల్ రూ. 101.82.. డీజిల్ రూ.91.98, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.105.54.. డీజిల్ రూ.96.99 చొప్పున ఉన్నాయి.