ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఈ నెల 4వ తేదీన మెమో జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్‌సీసీలు 1100 మంది వరకున్నారు. దీనిపై సెర్ప్ సీఈవో ఇంతియాజ్ వివరణ కోరగా సంబంధిత దస్త్రం తమకు ఇంకా చేరలేదని అన్నారు.
ఎంఎస్‌సీసీలు, అకౌంటెంట్లకు వేతనాలు పెంచుతామని, హెచ్‌ఆర్ పాలసీ అమలుచేయిస్తామని వెలుగు, వైకేపీలో పనిచేస్తున్న కొంతమంది నుంచి పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోని ఓ అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలొచ్చాయి.