వీటికి ఈనెలాఖరువరకే ఆధార్ డెడ్‌లైన్

సోమవారం, 4 డిశెంబరు 2017 (10:34 IST)
ఆధార్ అనుసంధాన గడువు సమీపిస్తోంది. కొన్నింటికి ఈనెలాఖరులోగా ఆధార్ నంబరు అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. లేనిపక్షంలో చెల్లింపులు నిలిచిపోనున్నాయి. 2017, డిసెంబర్ 31కి ముందు ఆధార్ నంబరును అనుసంధానం చేసుకోవాల్సిన వాటిలో పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా, ప్రభుత్వ పథకాలు (రేషన్, పెన్షన్, ఉచిత వైద్యం, ఫీ రీయింబర్స్ మెంట్), బీమా పాలసీలు, క్రెడిట్ కార్డులు, పోస్టాఫీస్ పథకాలు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ షేర్లు తదితరాలు ఉన్నాయి. 
 
2018, జనవరి 1 తర్వాత వీటిని ఆధార్ తో లింక్ చేయకపోతే మీరు బీమా చెల్లింపులు చేయలేరు. అదేవిధంగా బీమా మొత్తాలను పొందలేరు. ఐటీ రిటర్న్‌లను పరిశీలించరు. రిటర్న్‌లను ఫైల్ చేయాల్సిన అవసరం లేని వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ కాలంలో బ్యాంక్ ఖాతా, బీమా పాలసీలు కామన్. నెలాఖరులోగా ఆధార్ లింక్  చేయకపోతే లావాదేవీలు నిలిపేవేసే అవకాశం ఉంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డులు కలిగిన ఖాతాదారులు కూడా ఆధార్ నంబరును అనసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు