బీమా పాలసీలకు కూడా ఆధార్ లింకు చేయాల్సిందే...

గురువారం, 9 నవంబరు 2017 (11:44 IST)
బీమా పాలసీలకు కూడా ఆధార్ నంబరు లింకు చేయాల్సిందేనంటూ భారత బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) స్పష్టంచేసింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం, రెండో సవరణ-2017 ప్రకారం సాధారణ, జీవిత బీమా పాలసీలకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని ఐఆర్‌డీఏఐ తెలిపింది. 
 
ప్రస్తుతం కొత్త పాలసీలకు ఆధార్‌ను అనుసంధానించాల్సి ఉంటుందని, ఆర్థిక సేవలన్నింటికీ పాన్‌/ఫామ్‌ 16తో పాటు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేస్తూ, గత జూన్‌లో ప్రభుత్వం మనీలాండరింగ్‌ నిరోధక చట్టాన్ని సవరించింది. ఈ చట్టపరమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, తదుపరి ఆదేశాల కోసం వేచి చూడాల్సిన అవసరంలేదని సాధారణ, జీవిత బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ తెలిపింది. 
 
తాజా ఆదేశాల వల్ల స్వల్పకాలం పాటు ఇబ్బందులు తలెత్తినా, దీర్ఘకాలంలో ఎంతో మేలు జరుగుతుందని, మోసాల నివారణ, 'మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (కేవైసీ) నిబంధన'ల ఏకీకరణకు ఇది ఉపయోగపడుతుందని ఐసీఐసీఐ లాంబార్డ్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి భార్గవ్‌ దాస్‌ గుప్తా తెలిపారు. ఐఆర్డీఏఐ ఆదేశాలు దేశంలో 24 జీవితబీమా సంస్థలు, 33 సాధారణ బీమా సంస్థలు (ఆరోగ్యబీమా సంస్థలు సహా) ఈ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు