ఈపీఎఫ్‌వో దీపావళి బహుమతి... పీఎఫ్ ఖాతాల్లోకి వడ్డీ...

సోమవారం, 9 నవంబరు 2020 (09:16 IST)
పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో ఓ శుభవార్త చెప్పింది. దీపావళి పండుగ సందర్భంగా గత ఆర్థిక సంవత్సరం పీఎఫ్‌లోని మొత్తం వడ్డీలో 8.15 శాతం వారి ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమైంది. ఈ మొత్తం దీపావళికల్లా ఈ డబ్బు ఖాతాల్లో చేరుతుంది. 
 
పీఎఫ్‌ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీ మొత్తాన్ని 2020 డిసెంబర్‌ 31 నాటికల్లా జమచేస్తామని ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డు సెప్టెంబర్‌లోనే ప్రకటించింది. ఈ వడ్డీని రెండు విడతల్లో చందాదారులకు అందిస్తామని తెలిపింది. తొలివిడత కింద 8.15 శాతం, రెండో విడత కింద 0.35 శాతం వడ్డీని అందిస్తామని వివరించింది. 8.15 శాతం వడ్డీ మొత్తాన్ని దీపావళికల్లా జమ చేయనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు