ఫోర్బ్స్ రూపొందించిన గ్లోబల్ గేమ్ ఛేంజర్స్ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. భారత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజల జీవనం మార్పులు తీసుకురావడం.. ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడంతో సత్తాచాటారు. గ్లోబల్ గేమ్ ఛేంజర్స్ జాబితాను ఫోర్బ్స్ రూపొందించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
ఆయిల్ గ్యాస్ వరకు వ్యాపారాల్లో సత్తా చాటుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికామ్ మార్కెట్లోకి ప్రవేశించి.. ఉచిత ఆఫర్లు, అత్యంత చవకైన ధరలతో చాలా వేగవంతమైన ఇంటర్నెట్‌ను ఆఫర్ చేసిందని ఫోర్బ్స్ పేర్కొంది. అంతేగాకుండా, ఆరు నెలల కాలంలోనే 100 మిలియన్ల కస్టమర్ల మార్కును చేరుకుందని రిలయన్స్ జియోను ఉద్దేశించి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను కొనియాడింది.