గ్యాస్‌ మార్కెట్‌ అప్‌డేట్‌, మార్చి 2022 మరియు ఆర్ధిక సంవత్సరం 2022

గురువారం, 7 ఏప్రియల్ 2022 (23:44 IST)
ఇండియన్‌ గ్యాస్‌ ఎక్సేంజ్‌ (ఐజీఎక్స్‌) రికార్డు స్థాయిలో 33,33,900 ఎంఎంబీటీయు గ్యాస్‌ను వాణిజ్యం చేయడంతో పాటుగా మార్చి 2022లో అత్యధికంగా 2,20,500 ఎంఎంబీటీయు (2.2 ఎంఎంసీఎండీ) నమోదు చేసింది. ఒక్క రోజులో అత్యధికంగా వాణిజ్యం 7,58,400 ఎంఎంబీటీయును 16 మార్చి 2022న చేరుకుంది. అంతేకాదు, అత్యధిక సింగిల్‌ డే డెలివరీ 1,16,600 ఎంఎంబీటీయు (3ఎంఎంఎస్‌సీఎండీ)ను 16 మార్చి 2022న డెలివరీ చేసింది.

 
ఈ ఎక్సేంజ్‌ వద్ద మార్చి నెలలో కనుగొనబడిన సరాసరి ధర 1960 రూపాయలు/26.1 డాలర్లుగా ఒక్క ఎంఎంబీటీయుకు ఉంది. అదే సమయంలో సరాసరి అంతర్జాతీయ స్పాట్‌ గ్యాస్‌ ధర  దాదాపుగా ఒక ఎంఎంబీటీయుకు 40 డాలర్లుగా ఉంది.  ఈ నెలలో అన్ని అంతర్జాతీయ బెంచ్‌మార్క్స్‌ అయినటువంటి టీటీఎఫ్‌, జెకెఎం, డబ్ల్యుఐఎం లు తమ అత్యధికంగా దాదాపు 35+డాలర్లను నమోదు చేయగా, హెన్రీ హబ్‌ ఒక ఎంఎంబీటీయుకు 4.85 డాలర్లను నమోదు చేసింది. ఎక్సేంజ్‌పై కనుగొనబడిన ధరలు భారతదేశపు డిమాండ్‌ మరియు సహజవాయువు సరఫరాను ప్రతిబింబిస్తుంది మరియు ఎల్‌ఎన్‌జీ దీర్ఘకాలిక, స్పాట్‌ మరియు దేశీయ గ్యాస్‌ ధరలను చక్కగా ఒడిసిపట్టింది.
 
ఈ నెలలో మరో కీలకమైన ఆకర్షణగా  కొనుగోలుదారులతో పాటుగా విక్రేతలకు మరింత సౌకర్యం అందిస్తూ సరఫరా క్వాంటిటీ తగ్గించడంతో పాటుగా  కాంట్రాక్ట్‌ కాలంలో ఆబ్లిగేషన్‌ను 90% వరకూ తీసుకువెళ్లింది. కెబీ బేసిన్‌ హబ్‌ తప్ప మిగిలిన కేంద్రాల వ్యాప్తంగా దీనిని తీసుకువెళ్లడంతో పాటుగా సరఫరా మరియు ఆఫ్‌టేక్‌ను  85%కు తగ్గించారు.
 
ఏప్రిల్‌ 2022 నుంచి ఈ ఎక్సేంజ్‌ ఆరు వరుస నెలవారీ కాంట్రాక్ట్‌లను ప్రారంభించింది. గతంలో ఇది మూడు నెలవారీ కాంట్రాక్ట్‌లుగా ఉండేది. అంతేకాదు, టేక్‌ లేదా చెల్లింపుల ఆబ్లిగేషన్‌ గతంలో రోజువారీ పద్ధతిలో ఉంటే ఇప్పుడు కాంట్రాక్ట్‌ కాలంలో 90%కు పైగా సడలించడం జరిగింది.
 
ఈ నెలలో మరో కీలకాంశంగా  ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పోరేషన్‌ (ఓఎన్‌జీసీ) బోర్డుపై చేరడం నిలిచింది. ఎక్సేంజ్‌పై వ్యూహాత్మక ఇన్వెస్టర్‌గా , సభ్యునిగా ఇది నిలిచింది.
 
మార్చి 2022 నెలలో గ్యాస్‌ మార్కెట్‌లో కనిపించిన ప్రధాన ఆకర్షణలు ఈ దిగువ రీతిలో ఉన్నాయి:
 
రికార్డు స్థాయిలో అత్యధిక వాల్యూమ్‌ను ఒక నెలలో వాణిజ్యం చేయడం: 33,33,900 ఎంఎంబీటీయు
రికార్డు స్థాయిలో సింగిల్‌ డే ట్రేడ్‌ :16 మార్చి 2022న 7,58,400 ఎంఎంబీటీయు
రికార్డు స్ధాయి వాల్యూమ్‌ డెలివరీ : 27,20,500 ఎంఎంబీటీయు
ఒకే రోజు డెలివరీ చేసినఅత్యధిక వాల్యూమ్‌ :16 మార్చి 2022న 1,16,600 ఎంఎంబీటీయు
 
ఒక నెలలో రికార్డు సంఖ్యలో ట్రేడ్స్‌: 111
2022 ఆర్థిక సంవత్సర కీలకాంశాలు :
మొత్తం వాణిజ్య పరిమాణం : 1,21,51,150 ఎంఎంబీటీయు
మొత్తం ట్రేడ్స్‌ సంఖ్య: 443

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు