దేశంలో మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (07:38 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ ధరల బాదుడును చమురు కంపెనీలు ఆపడం లేదు. ఫలితంగా వీటి ధరలు జెట్ స్పీడ్ వేగంతో దూసుకునిపోతున్నాయి. గత 15 రోజుల్లో 13 సార్లు ధరలను పెంచేశాయి. మంగళవారం కూడా మరోమారు రేట్లు పెంచాయి. లీటరు పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు చొప్పున పెంచుతూ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 
 
ఈ తాజా ధరల పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.104.61గా ఉండగా, డీజిల్ ధర రూ.95.87కు చేరుకుంది. అలాగే ముంబైలో లీటరు పెట్రోల్ రూ.119.67గాను, డీజిల్ ధర రూ.103.92గా పలుకుతుండగా, హైదరాబాద్ నగరంలో ఇది రూ.118.59, 104.62గా వుంది. 
 
గత 13 రోజుల్లో మొత్తం 11 రూపాయల మేరకు ధరలను పెంచింది. ఈ పెరుగుదల ప్రతి ఒక్క నిత్యావసర సరకుల ధరలపై ప్రభావం పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు కూడా భారీగా పెరగడమే ప్రధాన కారణం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు