గుడ్ న్యూస్: పడిపోయిన పసిడి ధరలు.. వెండి కూడా తగ్గుముఖం..

బుధవారం, 31 మార్చి 2021 (14:41 IST)
పసిడి ధరలు పడిపోయాయి. బంగారం ధర వరుసగా రెండో రోజు దిగి వచ్చింది. పసిడి ధర తగ్గడంతో వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర దిగొచ్చింది.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పడిపోయింది. దీంతో రేటు రూ.45,110కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.350 క్షీణతతో రూ.41,350కు తగ్గింది. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర రూ.800 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.68,500కు దిగొచ్చింది. 
 
పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర మరింత తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.11 శాతం తగ్గుదలతో 1684 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.37 శాతం క్షీణతతో 24.04 డాలర్లకు తగ్గింది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు