బంగారం ధరలతో వెండి ధరలు పోటీపడుతున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ కారణంగా దేశీయంగా రికార్డు స్థాయి గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.92,150లకు చేరుకుంది. అదేసమయంలో బంగారం ధర రూ.92 వేలకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదే సమయంలో వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగి ప్రజలను షాక్‌కు గురిచేస్తున్నాయి. కిలో వెండి ధర రూ.1.03 లక్షలకు చేరుకుంది. గత యేడాదిలో బంగారం, వెండి ధరలు 37 శాతం మేరకు పెరగగా, గత నెలలో బంగారం ధర 6.70 శాతం, వెండి ధర రూ.8.80 శాతం మేరకు పెగిగాయి.