హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు వేగంగా రుణాలు

సోమవారం, 6 జులై 2020 (10:10 IST)
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బంపర్ లోన్ ఆఫర్ ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తమ కస్టమర్లకు తక్షణమే రుణాలు మంజూరు చేసేందుకు జిప్‌డ్రైవ్ ఇన్‌స్టంట్ ఆటో లోన్స్ ప్రారంభించింది. ఈ రుణాలను టెక్నాలజీ సాయంతో వేగంగా కస్టమర్ల అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి.
 
కస్టమర్లు బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరమే లేదు. వాహన రుణాలు తీసుకోవాలనుకునే కస్టమర్లు ఈ సదుపాయాన్ని ఉపయోగించొచ్చు. ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ కింద బ్యాంకు కస్టమర్లకు కేవలం 10 సెకన్లలో లోన్లు మంజూరు చేస్తోంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు. 
 
ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంతో పాటు భారతదేశంలోని 1000 టైర్ 2, 3 పట్టణాల్లో ఈ ఆఫర్స్ అందిస్తోంది. ఆన్‌లైన్‌లో అత్యంత వేగంగా రుణాలు మంజూరు చేసే విధానం జిప్‌డ్రైవ్ అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు