దేశంలో బంగారం, పామాయిల్ ధరల తగ్గనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గాయి. దీంతో బేసిక్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. ఫలితంగా బంగారం, పామాయిల్ వంటి ధరలు కిందకు దిగిరానున్నాయి. ఆర్బీడీ పామోలిన్‌తో పాటు వెండి ధరల్లో కూడా ఈ మార్పు కనిపించనుంది.
ప్రతి 15 రోజులకు ఒకసారి వంట నూనెలు, బంగారం, వెండి దిగుమతులపై బేసిక్ డ్యూటీని కేంద్రం సవరించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో భారత్ వంట నూనెలు, వెండి విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. బంగారంలో రెండో అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది.