వైజాగ్, హైదరాబాద్ స్టేషన్లకు అందుబాటులో రూ.20కే ఎకానమీ మీల్స్

సెల్వి

బుధవారం, 24 ఏప్రియల్ 2024 (10:04 IST)
భారతీయ రైల్వేలు పాకెట్-ఫ్రెండ్లీ ఎకానమీ మీల్స్‌ను పరిచయం చేసింది. రూ.20లకే నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించనుంది. అలాగే రూ. 50కి స్నాక్స్ అందించనుంది. ఈ ఎకానమీ మీల్స్ 12 స్టేషన్లలలో, దక్షిణ మధ్య రైల్వేలోని 23 కౌంటర్లలో ప్రయాణికులకు అందించబడుతున్నాయి. 
 
భారతీయ రైల్వేలు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సహకారంతో రైలు ప్రయాణికులకు, ముఖ్యంగా జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారికి నాణ్యమైన, సరసమైన, హైజినిక్ భోజనాన్ని అందించడానికి 'ఎకానమీ మీల్స్'ను ప్రవేశపెట్టింది. 
 
వేసవిలో ప్రయాణీకుల రద్దీని అంచనా వేస్తూ, రైలు ప్రయాణీకులకు ముఖ్యంగా జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారికి సరసమైన ధరలో రెండు రకాల భోజనం అందించబడుతుంది. ఈ భోజన కౌంటర్లు ఇప్పుడు 100కి పైగా స్టేషన్లలో, భారతీయ రైల్వేలో మొత్తం దాదాపు 150 కౌంటర్లలో పనిచేస్తున్నాయి.
 
అంతకుముందు, ఈ సేవ గత సంవత్సరం భారతీయ రైల్వేలో దాదాపు 51 స్టేషన్లలో విజయవంతంగా ప్రయోగాత్మకంగా అమలు చేయబడింది. ఆ విజయాన్ని పురస్కరించుకుని, రైల్వేలు ఈ కార్యక్రమాన్ని గణనీయంగా విస్తరించింది. ఇప్పుడు 100 స్టేషన్లలో కౌంటర్లు, మొత్తం దాదాపు 150 కౌంటర్లు పనిచేస్తున్నాయి.
 
ఎకానమీ భోజన సదుపాయం ప్రధానంగా సాధారణ ప్రయాణికులకు ఉపయోగపడుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఎస్సీఆర్ ద్వారా, ఇవి ఏడు స్టేషన్లలో అందించబడుతున్నాయి. ఈ స్టేషన్లలో పనిచేస్తున్న ఐఆర్టీసీ కిచెన్ యూనిట్ల నుండి ఎకానమీ భోజనంతో అందించబడతాయి. ఇవి విజయవాడ, హైదరాబాద్ వంటి రైల్వే స్టేషన్లలోనూ అందుబాటులో వుంటాయి. 
 
ఎకానమీ మీల్స్ : పాకెట్-ఫ్రెండ్లీ ధర రూ. 20,
స్నాక్ మీల్స్ : రూ. 50 స్నాక్ మీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు