మాల్దీవ్స్‌‌కు వెళ్లాలా.. హైదరాబాద్ నుంచి ఇండిగో సర్వీస్

బుధవారం, 1 నవంబరు 2023 (17:14 IST)
మాల్దీవ్స్‌లో విహరించాలనుకునే ప్రయాణికులకు చౌకధరల విమానయాన సంస్థ ఇండిగో చల్లని కబురు చెప్పింది. హైదరాబాద్ నుంచి మాలేకు మంగళవారం నుంచి నుంచి డైరెక్ట్ సర్వీసులను మళ్లీ ప్రారంభించింది. మంగళ, గురు, శనివారాల్లో హైదరాబాద్-మాలె విమానం అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. 
 
ఈ మూడు రోజుల్లో శంషాబాద్ విమానాశ్రయంలో ఉదయం 10.20 గంటలకు విమానం బయలుదేరి మధ్యాహ్నం 12.35 గంటలకు మాలె చేరుకుంటుంది. గంట తర్వాత అంటే 1.25 గంటలు తిరిగి అక్కడ బయలుదేరి సాయంత్రం 4.25 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు