దేశంలో తమ 96వ అత్యాధునిక కేంద్రాన్ని కరీంనగర్‌లో ప్రారంభించిన ఇందిర ఐవీఎఫ్‌

మంగళవారం, 6 జులై 2021 (18:16 IST)
భారతదేశంలో అతిపెద్ద సంతానోత్పత్తి చికిత్స గొలుసుకట్టు సంస్థలలో ఒకటైన ఇందిర ఐవీఎఫ్‌,  తెలంగాణా రాష్ట్రంలోని కరీంనగర్‌లో ఔత్సాహిక తల్లిదండ్రుల కోసం తమ తలుపులను తెరిచింది. దీనితో, అత్యుత్తమ విజయశాతానికి ఖ్యాతి గడించిన మరియు రోగులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా కలిగిన ఫెర్టిలిటీ కేంద్రం తెలంగాణాలో తమ 5వ కేంద్రాన్ని ప్రారంభించినట్లయింది. ఈ  కేంద్రం ప్రారంభించడం ద్వారా భారతదేశంలో సంస్థ కేంద్రాల సంఖ్య 96కు పెరిగింది. తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ మరియు వరంగల్‌లలో సంస్థ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా 1000 కు పైగా జంటలకు మాతృత్వపు కలలను సాకారం చేసింది.
 
గత దశాబ్ద కాలంలో దేశంలో ఒక లక్షకు పైగా ఐవీఎఫ్‌ సైకిల్స్‌ను ఇందిర ఐవీఎఫ్‌ నిర్వహించింది. తద్వారా 85వేలకు పైగా జంటలకు గర్భం దాల్చేందుకు తోడ్పడింది. అత్యాధునిక సాంకేతికత తోడుగా విస్తృతస్థాయిలో వైద్య నిపుణులు మరియు ఐవీఎఫ్‌ స్పెషలిస్ట్‌లు నైపుణ్యం జోడించి ఈ సంస్థ అసాధారణ విజయశాతాన్ని తమ ప్రక్రియల వ్యాప్తంగా సాధించింది. అత్యాధునిక సహాయక  పునరుత్పత్తి సాంకేతికతలైనటువంటి ఎలకా్ట్రనిక్‌ విట్నెసింగ్‌ సిస్టమ్స్‌, క్లోజ్డ్‌ వర్కింగ్‌ చాంబర్స్‌, ఆర్టిఫిషీయల్‌ ఇంటిలిజెన్స్‌, మైక్రోఫ్లూయిడిక్స్‌ మరియు మరెన్నో దేశ వ్యాప్తంగా మరియు తెలంగాణా రాష్ట్రంలోని సంతానం లేని జంటలకు అత్యుత్తమ చికిత్సావకాశాలను అందిస్తున్నాయి.
 
ఈ సందర్భంగా డాక్టర్‌ క్షితిజ్‌ ముర్దియా, సీఈవో అండ్‌ కో-ఫౌండర్‌, ఇందిరా ఐవీఎఫ్‌ మాట్లాడుతూ, ‘‘కరీంనగర్‌లో మా కేంద్రాన్ని ప్రారంభించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము మరియు సంతానం కోసం పరితపించే జంటలకు ఆపన్న హస్తం అందించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మారిన జీవనశైలి, వివాహ వయసు పెరగడం, ఆలస్యంగా సంతానం కోసం ప్రణాళిక చేయడం, పెరుగుతున్న ఒత్తిడి వంటి వాటి వల్ల జంటలు సహజసిద్ధంగా గర్భందాల్చడంలో తీవ్ర  ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. సంతానోత్పత్తి పరంగా భావోద్వేగ మరియు ఆర్ధిక భారాన్ని తగ్గించేందుకు తగిన ప్రయత్నాలను చేయడంతో పాటుగా తెలంగాణా, కరీంనగర్‌ వాసులకు సహాయపడటాన్ని అతి కీలకాంశంగా భావిస్తున్నాం, తద్వారా మరిన్ని ప్రాంతాలకు మేము మా మద్దతును విస్తరించనున్నాం’’ అని అన్నారు.
 
భారతదేశంలో, సంతానోత్పత్తి చికిత్సలకు సంబంధించిన  అవగాహన పరిమితంగా ఉంది. సంతానలేమితో బాధపడుతున్న జంటలలో అధికశాతం మహిళలపై వివక్ష కనిపిస్తుంటుంది. ప్రతి ఆరు జంటలలో ఒక జంటకు సంతానం పొందడం కష్టంగా ఉంటుంది. దీనికి స్త్రీ/పురుషులలో నిర్మాణాత్మక పరిస్థితులు కారణం కావడంతో పాటుగా కొన్ని కేసులలో ఇరువురిలోనూ లోపాలు ఉండటమూ కారణమవుతుంటుందని గమనించాలి. సహాయక పునరుత్పత్తి సాంకేతికత ఈ స్త్రీ, పురుషులిరువురికీ అవసరమైన పరిష్కారాలను అందిస్తుంది మరియు వారి మాతృత్వ ప్రయాణమంతటా తగిన మద్దతునూ అందిస్తుంది. సాంకేతికత పరంగా ఇందిర ఐవీఎఫ్‌ అభివృద్ధి చేసిన విప్లవాత్మతక ఆవిష్కరణలతో ఎన్నోజంటలు తొలి ప్రయత్నంలోనే గర్భం దాల్చాయి.
 
ఐవీఎఫ్‌ ప్రక్రియ గురించి డాక్టర్‌ వేణుకోటి మీనార్సి- సెంటర్‌ హెడ్‌, ఇందిర ఐవీఎఫ్‌, కరీంనగర్‌ మాట్లాడుతూ, ‘‘సహజసిద్ధంగా గర్భందాల్చడంలో స్త్రీ, పురుషులలో ఎదురవుతున్న అవరోధాలను ముందుగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ జంటలకు అనుకూలమైన చికిత్స మార్గదర్శకాలు అందరికీ ఒకేలా ఉండవు. పరీక్షా ఫలితాలను అనుసరించి మరియు గతంలో ఏదైనా చికిత్సతీసుకుంటే వాటి ఫలితాలను ఆధారంగా చేసుకుని ఈ ప్రక్రియను నిర్ధారిస్తారు. సాధారణంగా అండాలను సేకరించడం మరియు వీర్య నమూనాలను తీసుకోవడం జరుగుతుంది.
 
ఒకవేళ అవసరం అయితే వీర్య దాన ప్రక్రియను సైతం వినియోగించాల్సి ఉంటుంది. వాటిని ఫలదీకరించి, లేబరేటరీ వాతావరణంలో పరిశీలించి, గర్భాశయంలోకి బదిలీ చేస్తారు మరియు 12 రోజుల తరువాత గర్భధారణ పరీక్ష చేస్తారు. కరీంనగర్‌ సెంటర్‌లోని సిబ్బంది అత్యున్నత అర్హతలు కలిగిన వారు. వారు ఈ రంగంలో ప్రత్యేక నైపుణ్యమూ కలిగి ఉన్నారు. మీ ఆశలకు ఓ రూపం ఇవ్వడంతో పాటుగా మీ జీవితాలలో సంతోషం తీసుకురావాలన్నది మా ప్రయత్నం’’ అని అన్నారు. ఆమెనే మాట్లాడుతూ ‘‘ మా కేంద్రం ప్రారంభోత్సవ సందర్భంగా ఉచిత సంతానోత్పత్తి అవగాహన శిబిరాన్ని నిర్వహిస్తున్నాము.  దానిలో భాగంగా విచ్చేసిన జంటలకు ఇందిర ఐవీఎఫ్‌ ఫెర్టిలిటీ నిపుణుల చేత ఉచిత కన్సల్టేషన్‌ సైతం అందిస్తారు. ఈ ఆఫర్‌ 31 జూలై 2021వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది’’ అని అన్నారు.
 
అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన, ఇందిర ఐవీఎఫ్‌ అసంఖ్యాక జంటలకు తరచుగా సంక్లిష్టమైన సంతానోత్పత్తి ప్రయాణంలో తోడ్పడటంతో పాటుగా ఓ కుటుంబాన్ని పొందాలనే వారి కలలనూ సాకారం చేసింది. అదే సమయంలో, ఇది కౌన్సిలింగ్‌ సైతం అందించడంతో పాటుగా అండం, వీర్యం శీతలీకరణ సదుపాయాలనూ అందించడం ద్వారా తమ నలభై సంవత్సరాల వరకూ కూడా తమ కుటుంబ ప్రణాళికలను వాయిదా వేసుకుంటున్న ఎన్నో జంటలకు వరంగానూ నిలిచింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు