పట్టణ పరిశుభ్రతకై స్పార్క్లింగ్ సైబరాబాద్‌ను ప్రారంభించిన ఇనార్బిట్ మాల్ హైదరాబాద్

ఐవీఆర్

గురువారం, 13 ఫిబ్రవరి 2025 (22:44 IST)
హైదరాబాద్: తమ NGO భాగస్వామి నిర్మాన్ ఆర్గనైజేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)తో కలిసి ఇనార్బిట్ మాల్ హైదరాబాద్, సైబరాబాద్ అంతటా పట్టణ పరిశుభ్రతను మెరుగుపరచడానికి ఒక కార్యక్రమంను ప్రారంభించింది. “స్పార్క్లింగ్ సైబరాబాద్” ప్రాజెక్టులో భాగంగా, నగరంలో పారిశుధ్యం, పరిశుభ్రతను పెంపొందించడానికి ఆరు ఆటోమేటెడ్ ఎలక్ట్రిక్ లిట్టర్ పికప్ యంత్రాలను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయబడతాయి. 
 
కొండాపూర్ (బొటానికల్ గార్డెన్), మాదాపూర్ (ఇనార్బిట్ మాల్, దుర్గం చెరువు పార్క్), హైటెక్ సిటీ(శిల్పారామం పార్క్, హైటెక్ సిటీ ఫుడ్ స్ట్రీట్స్, హైటెక్స్ ఆర్చ్), గచ్చిబౌలి (DLF స్ట్రీట్ ఫుడ్ ఏరియా, రాయదుర్గం మెట్రో స్టేషన్) వంటి కీలక ప్రాంతాలలో ఈ యంత్రాలు పనిచేస్తాయి. వారానికి ఆరు రోజులు పనిచేసే ఈ యంత్రాలు, ప్రజా స్థలాలు, పార్కులు, టెక్ హబ్‌లను పరిశుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. 
 
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోన్ జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, “ చెత్తను ఏరివేసే యంత్రాలను ప్రవేశపెట్టడం జిహెచ్‌ఎంసిలో ఇదే మొదటిసారి. నగరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పరివర్తనాత్మక మార్పును తీసుకువచ్చినందుకు ఇనార్బిట్ మాల్, కె రహేజా కార్ప్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అని అన్నారు. కె రహేజా కార్ప్(ఏపి & తెలంగాణ) సిఓఓ శ్రావణ్ కుమార్ గోన్ మాట్లాడుతూ, "హైదరాబాద్‌ను పరిశుభ్రమైన, మరింత పర్యావరణ అనుకూల నగరంగా మార్చే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా ఈ కార్యక్రమం నిలుస్తుంది" అని అన్నారు.
 
ఈ ప్రాజెక్ట్ పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసిన ఇనార్బిట్ మాల్స్- AVP ఆపరేషన్స్ శరత్ బెలవాడి మాట్లాడుతూ, "అర్థవంతమైన ప్రభావాన్ని సృష్టించడం ద్వారా మేము సమాజానికి తిరిగి ఇవ్వాలని కోరుకున్నాము. ఈ కార్యక్రమం కోసం నిర్మాన్ ఆర్గనైజేషన్, GHMCతో భాగస్వామ్యం చేసుకోవటం సంతోషంగా ఉంది" అని అన్నారు. నిర్మాన్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు, గ్లోబల్ సీఈఓ శ్రీ మయూర్ పట్నాల మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ద్వారా, ఎక్కువ పౌర బాధ్యతను పెంపొందించడం, నగరంలో సస్టైనబిలిటీ ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు