అత్యాధునిక ఫీచర్లతో కూడిన రోబో వాక్యూమ్ క్లీనర్, బటన్ నొక్కితే చాలు ఇల్లు అద్దంలా చేస్తుంది
గురువారం, 2 జూన్ 2022 (16:25 IST)
హోమ్ అప్లయెన్సస్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో అంతర్జాతీయంగా అగ్రగామి కావడంతో పాటుగా మేజర్ అప్లయెన్సస్ విభాగంలో గత 13 సంవత్సరాలుగా ప్రపంచంలో నెంబర్ 1 బ్రాండ్‌గా వెలుగొందుతున్న హైయెర్ నేడు తమ మొట్టమొదటి స్మార్ట్ వాక్యూమ్ క్లీనర్ టెక్నాలజీ 2ఇన్1 డ్రై అండ్ వెట్ మాప్ రోబో వాక్యూమ్ క్లీనర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. క్లీనింగ్‌ను మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా, వినియోగదారులకు అనుకూలంగా మలచడంతో పాటుగా తమ స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ పోర్ట్‌ఫోలియోను మరింత శక్తివంతం చేసుకోవాలనే నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుంది.
గుగూల్ హోమ్ అసిస్ట్ మరియు 2.4 గిగా హెర్ట్జ్ వైఫైతో కూడిన పూర్తి సరికొత్త హైయెర్ రోబో వాక్యూమ్ క్లీనర్, హైయెర్ స్మార్ట్ యాప్, వాయిస్ కంట్రోల్ మరియు రిమోట్ కంట్రోల్‌తో స్మార్ట్ మేనేజ్‌మెంట్‌ను సైతం అందిస్తుంది. హైయెర్ రోబో వాక్యూమ్ క్లీనర్‌ను ప్రపంచంలో ఎక్కడ నుంచైనా అతి సౌకర్యవంతంగా పర్యవేక్షించవచ్చు. ఈ వాక్యూమ్ క్లీనర్ అన్ని రకాల ఫ్లోర్స్‌పై శక్తివంతమైన శుభ్రతు అందిస్తుంది. అదే సమయంలో అవరోధాలు నిరోధించి గీతలు, ఫ్లోర్ పాడవకుండా కాపాడుతుంది. దీనిలోని 2200 పీఏ అలా్ట్ర స్ట్రాంగ్ సక్షన్ పవర్, ప్రాక్సిమిటి సెన్సార్లు దీనికి దోహదపడతాయి. సంప్రదాయ వాక్యూమ్ క్లీనర్స్‌తో పోలిస్తే ఈ శక్తివంతమైన వాక్యూమ్ క్లీనర్‌లో 2600 ఎంఏహెచ్ శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్ ఉంది. దీనిని సుదీర్ఘకాలం పాటు నిర్వహించవచ్చు. దీనిలోని 2 ఇన్1 డ్రై అండ్ వెట్ మాపింగ్ సాంకేతిక కారణంగా అన్ని రకాల ప్రాధమిక పరిశుభ్రతా అవసరాలకు ఇది అత్యంత అనువుగా ఉంటుంది.
ఈ ఆవిష్కరణ గురించి హైయెర్ అప్లయెన్సస్ ఇండియా అధ్యక్షుడు శ్రీ సతీష్ ఎన్‌ఎస్ మాట్లాడుతూ, ఈ నూతన విభాగంలో ప్రవేశిస్తున్నామని వెల్లడించేందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. విప్లవాత్మక సాంకేతికతలతో కూడిన స్మార్ట్ సొల్యూషన్స్‌ను పరిచయం చేయాలనే మా కేంద్రీకృత ప్రయత్నాలు మాకు అత్యుత్తమ ఫలితాలను అందిస్తున్నాయి. ఇవి అత్యంత ప్రభావవంతమైనవి మరియు సమర్ధనీయమైనవి. హైయెర్ ఇండియా వద్ద మేము ప్రజల జీవితాలలో సానుకూల మార్పులను తీసుకురావాలనుకుంటున్నాము. ఈ నూతన ఆఫరింగ్ మా నిబద్ధతకు నిదర్శనం. కాలంతో పాటుగా మేము మరింత ముందుకు వెళ్తే, మేము మా సృజనాత్మక నైపుణ్యాలను ప్రదర్శించడంపై ప్రధానంగా దృష్టి సారించాము. మరీ ముఖ్యంగా మా ఉత్పత్తి, సాఫ్ట్‌వేర్ ఆవిష్కరణలను చూపాలనుకుంటున్నాము. ఇది నిరంతరం వృద్ధి చెందే సాంకేతిక పర్యావరణ వ్యవస్ధలో మమ్మల్ని అగ్రస్థానంలో నిలుపనున్నాయి అని అన్నారు.
ఈ ఉత్పత్తిలో కొన్ని ప్రధాన ఆకర్షణలు...
పెద్దదైన డస్ట్‌బిన్- పలు క్లీనింగ్ సైకిల్స్ వ్యాప్తంగా మరింత ధూళి, మురికిని ఇది నిల్వచేస్తుంది. భారీ 600మిల్లీ లీటర్ డస్ట్‌బిన్ ప్రతి సారీ ఖాళీ చేయాల్సిన అవసరం తప్పిస్తుంది
350మిల్లీ లీటర్ వాటర్ ట్యాంక్- ఈ శ్రేణిలో అత్యుత్తమ, భారీ ఎలక్ట్రానిక్ వాటర్ ట్యాంక్ అత్యుత్తమ నీటి ప్రవాహ నిర్వహణకు తోడ్పడుతుంది.
ఆటోమేటిక్ సెల్ఫ్ చార్జింగ్- రోబో వాక్యూమ్ క్లీనర్, బ్యాటరీ స్థాయి తగ్గితే తనంతట తాను చార్జింగ్ స్టేషన్‌కు వస్తుంది.
స్పాట్ క్లీన్- హైయెర్ స్మార్ట్ యాప్‌లో స్పాట్ క్లీన్ ఎంచుకుంటే హైయెర్ రోబో వాక్యూమ్ క్లీనర్ ఆ నిర్ధిష్టమైన ప్రాంతాన్ని శుభ్రపరుస్తుంది.
ఎడ్జ్‌క్లీన్- హైయెర్ రోబో వాక్యూమ్ క్లీనర్, మూలలు, అంచులు వద్ద కూడా హైయెర్ స్మార్ట్ యాప్‌పై ఎడ్జ్ క్లీన్ ఆప్షన్ ఎంచుకున్న ఎడల అందిస్తుంది.
మెట్లపై పడిపోకుండా క్లిఫ్ సెన్సార్- హైయెర్ రోబో వాక్యూమ్ క్లీనర్‌లో క్లిఫ్ సెన్సార్ ఉంది. ఇది ఎత్తు నుంచి పడిపోకుండా కాపాడుతుంది. ఒకవేళ మెట్లలాంటివి ఇది గుర్తిస్తే, ఇది ఆటోమేటిక్‌గా ఆన్ కావడంతో పాటుగా అంచులు శుభ్రపరిచి తప్పుకుంటుంది.
ఆటో క్లీనింగ్- ఈ నూతన తరపు వాక్యూమ్ ఆటో క్లీనింగ్ సాంకేతికతకు మద్దతునందిస్తుంది. ప్రధానమైన ఇంజిన్ బాణం ఆకారపు మార్గం అనుసరిస్తూ వినియోగదారుల ఇంటిని శుభ్రపరుస్తాయి.
పాజ్. వేకప్, టర్న్ ఆఫ్- ఈ క్లీనర్ పనిచేస్తోన్న సమయంలో వినియోగదారుడు దీనిని ఆపాలనుకుంటే రోబో కీ నొక్కితే ఆగుతుంది. అలాగే 10 నిమిషాలు ఏకధాటిగా వాడకపోతే అది స్లీప్ మోడ్‌లోకి వెళ్తుంది. దీనిని తిరిగి మేల్కొలపడానికి యాప్‌లో ఏ కీ నొక్కినా సరిపోతుంది. ఇక రోబో కీని ఎక్కువ సేపు నొక్కి ఉంచితే ఇది ఆగిపోతుంది.
హైయెర్ రోబో వాక్యూమ్ క్లీనర్ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. అతి సన్నటి డిజైన్, 76ఎంఎం ఎత్తు కలిగిన ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ అతి సులభంగా ఫర్నిచర్ కిందకు కూడా చేరుకుని శుభ్రపరుస్తుంది. ఇది రూ. 14,999 ధరలో అందుబాటులో వుండనుంది.