గురుగ్రామ్: సౌకర్యంతో కారు కొనుగోలు చేసే అనుభవాన్ని పునర్నిర్వచించడానికి, తమ ఫ్లాగ్ షిప్ SUV కోసం ఉల్లాసభరితమైన కొత్త కాంపైన్, ఎంతగానో ఇష్టపడే MG Hector- “మిడ్ నైట్ కార్నివాల్” ను JSW MG మోటార్ ఇండియా ప్రారంభించింది. ఈ ప్రత్యేకమైన కాంపైన్ పరిమిత సమయం వరకు ప్రతి వారాంతంలో అర్థ రాత్రి వరకు తెరిచి ఉండే షోరూంలను సందర్శించవలసిందిగా కస్టమర్లను ఆహ్వానిస్తోంది. ఈ ఆఫర్ సమయంలో భాగంగా, 20 లక్కీ MG Hector బయ్యర్లు రూ. 4 లక్షల విలువైన ప్రత్యేకమైన ప్రయోజనాలతో పాటు లండన్‌కు పర్యటించే కలల ట్రిప్‌ను గెలుచుకోవచ్చు.
ఆఫర్ ప్రోగ్రాం సమయంలో, JSW MG మోటార్ ఇండియా కారు కొనుగోలు ఉత్సాహాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడిన విలువ ప్రోత్సాహిత ఆఫర్లను కూడా తెస్తోంది. కొత్త హెక్టర్ బయ్యర్లు 2 అదనపు సంవత్సరాల రోడ్ సైడ్ సహాయంతో పాటు స్టాండర్డ్ 3 సంవత్సరాల వారంటీకి అదనంగా 1 లక్ష కిమీ/2 సంవత్సరాల దీర్ఘకాల వారంటీని కూడా పొందవచ్చు. ఇది చింతలు లేని 5 సంవత్సరాల యాజమాన్యాన్ని నిర్థారిస్తోంది. ప్రస్తుతం రిజిస్టర్ చేయబడిన హెక్టర్ వాహనాల కోసం కాంపైన్ 50% RTO ప్రయోజనాలు, MG Accessories పొందే అవకాశం కూడా అందిస్తోంది. అలాంటి చొరవలు SUVకి పెరుగుతున్న ఔత్సాహికుల సంఖ్యకు MG మోటార్ ఇండియా వారి నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది.
కాంపైన్ గురించి వ్యాఖ్యానిస్తూ, రాకేష్ సేన్, సేల్స్ హెడ్, JSW MG మోటార్ ఇండియా ఇలా అన్నారు, “MG Hector భారతదేశంలోని SUVని ఇష్టపడే వారికి ఆదర్శవంతమైన మోడల్‌గా ఎల్లప్పుడూ నిలిచింది మరియు మా మిడ్ నైట్ కార్నివాల్ ఆ వారసత్వం యొక్క విలక్షణమైన సంబరం. గుర్తుండిపోయే అనుభవాలతో ఆకర్షణీయమైన ఆఫర్లను కలపడం ద్వారా, మేము నిజమైన ప్రత్యేకతలో భాగంగా ఉండటానికి మా ప్రస్తుత మరియు భవిష్య కస్టమర్ల కోసం అవకాశాలను సృష్టిస్తున్నాం.”