ఈ ప్రాజెక్టు విలువ రూ.1,800 కోట్లు కాగా, ఇందులో భాగంగా 44 ట్రైన్స్ సెట్స్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇండియన్ రైల్వే టెండర్లు ఆహ్వానించగా, బీహెచ్‌ఈఎల్, మేధాసెర్వో డ్రైవ్స్, సీఆర్ఆర్‌సీ-పయనీర్ ఎలక్ట్రిక్ ఇండియాలు బిడ్లు దాఖలు చేశాయి.
సీఆర్ఆర్‌సీ-పయనీర్ సంస్థ బీజింగ్‌కు చెందిన సీఆర్ఆర్‌సీ యోగ్జి ఎలక్ట్రిక్ లిమిడెట్, భారత్‌కు చెందిన పయనీర్ ఫిల్-మెడ్ లిమిటెడ్ జాయింట్ వెంచర్. వందేభారత్ ట్రైన్స్ సెట్స్ తయారీ కాంట్రాక్ట్ దక్కించుకోవాలంటే ఆ సంస్థ మూలాలు భారత్‌లో ఉండాలి.
అయితే, సీఆర్ఆర్‌సీ-పయనీర్ ఎలక్ట్రిక్ ఇండియా మూలాలు చైనాలో ఉండడంతో ఆ సంస్థ దాఖలు చేసిన బిడ్ చెల్లదని తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు ఈ రేసులో బీహెచ్‌ఈఎల్, మేధాసెర్వో డ్రైవ్స్ మాత్రమే మిగిలాయి.