కడపలో నటి శ్రీలీల చేతుల మీదుగా కల్యాణ్ జ్యుయలర్స్ షోరూమ్‌ ప్రారంభం

ఐవీఆర్

బుధవారం, 3 ఏప్రియల్ 2024 (21:52 IST)
భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన, దిగ్గజ జ్యుయలరీ బ్రాండ్స్‌లో ఒకటైన కల్యాణ్ జ్యుయలర్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో తమ అప్‌డేటెడ్ షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించనుంది. సరికొత్తగా తీర్చిదిద్దిన షోరూమ్‌ను ఏప్రిల్ 5న (శుక్రవారం) సాయంత్రం 3 గం.లకు ప్రముఖ టాలీవుడ్ స్టార్ శ్రీలీల ప్రారంభిస్తారు. ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు, తిరుపతితో పాటు మరెన్నో ప్రధాన నగరాల్లో కల్యాణ్ జ్యుయలర్స్ కార్యకలాపాలు సాగిస్తోంది.
 
షోరూమ్ ప్రారంభం సందర్భంగా కొనుగోలుదారులకు కల్యాణ్ జ్యుయలర్స్ విస్తృతమైన ఆఫర్లు అందించనుంది. అన్ని ఉత్పత్తులపైనా మేకింగ్ చార్జీలపై ఫ్లాట్ 25 శాతం డిస్కౌంటును అందించనుంది. అలాగే అక్షయ తృతీయ కోసం బుకింగ్స్‌ను కూడా సంస్థ ప్రారంభించింది. కొనుగోలుదారులు 5 శాతం అడ్వాన్స్ చెల్లించి పసిడి ధరను లాక్ చేసుకోవడం ద్వారా కల్యాణ్ జ్యుయలర్స్ నుంచి ఆభరణాలను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ లాకిన్ ధర కన్నా బంగారం ధర తగ్గిన పక్షంలో ఆ తక్కువ ధరకే పొందవచ్చు. తద్వారా బంగారం రేట్లలో హెచ్చుతగ్గుల వల్ల ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకోవచ్చు.
 
కొత్త షోరూం ఆవిష్కరణపై స్పందిస్తూ,“ఆంధ్రప్రదేశ్‌లోని మా షోరూమ్‌ను సరికొత్తగా తీర్చిదిద్ది, అందుబాటులోకి తెస్తున్నామని తెలిపేందుకు ఎంతగానో సంతోషిస్తున్నాం. మా విలువైన కస్టమర్లకు ఇది ఒక చక్కని షాపింగ్ అనుభూతిని అందించగలదు. కొత్తగా తీర్చిదిద్దిన కడప షోరూమ్, కస్టమర్లకు మమ్మల్ని మరింత చేరువ చేయగలదని విశ్వసిస్తున్నాం” అని కల్యాణ్ జ్యుయలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రమేష్ కల్యాణరామన్ తెలిపారు.
 
కల్యాణ్ జ్యుయలర్స్‌లో విక్రయించే ఆభరణాలన్నీ బీఐఎస్ హాల్‌మార్క్ కలిగి ఉంటాయి. స్వచ్ఛతకు సంబంధించి వాటికి పలు కఠినమైన పరీక్షలు నిర్వహించబడతాయి. స్వచ్ఛతకు భరోసా కల్పించేలా కొనుగోలుదారులకు కల్యాణ్ జ్యుయలర్స్ 4-లెవెల్ అష్యూరెన్స్ సర్టిఫికెట్, ఆభరణాలకు ఉచిత లైఫ్‌టైమ్ మెయింటెనెన్స్, ఉత్పత్తికి సంబంధించి సవివరమైన సమాచారం అందించడంతో పాటు పారదర్శకమైన ఎక్స్చేంజ్, బై-బ్యాక్ విధానాలను సంస్థ అమలు చేస్తోంది.
 
షోరూమ్‌లో పేరొందిన కల్యాణ్ జ్యుయలర్స్ హౌస్ బ్రాండ్స్ అన్నీ లభిస్తాయి. ముహూరత్ (వెడ్డింగ్ జ్యుయలరీ కలెక్షన్), ముద్ర (హ్యాండ్‌క్రాఫ్టెట్ యాంటిక్ జ్యుయలరీ), నిమహ్ (టెంపుల్ జ్యుయలరీ) అనోఖి (అన్‌కట్ డైమండ్స్) మొదలైనవి వీటిలో ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు