10 భాషలలో 'టాపిక్స్' ఫీచర్‌ను విడుదల చేసిన మొదటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం కూ(Koo)
మంగళవారం, 23 ఆగస్టు 2022 (20:27 IST)
బహుభాషా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం కూ యాప్‌లో 10 భాషల్లో అద్భుతమైన ఫీచర్ టాపిక్స్‌ని విడుదల చేసింది. వివిధ భాషా యూజర్లకు ఈ అంశాలు అత్యంత వ్యక్తిగతమైన గొప్ప అనుభవాన్ని అందిస్తాయి. హిందీ, బంగ్లా, మరాఠీ, గుజరాతీ, కన్నడ, తమిళం, తెలుగు, అస్సామీ, పంజాబీ మరియు ఇంగ్లీష్ లాంటి 10 భారతీయ భాషలలో ఈ ఫీచర్‌ని ప్రారంభించిన మొదటి మరియు ఏకైక ప్లాట్‌ఫాం కూ (Koo).
భాష మొదటి విధానంతో నిర్మించబడిన సమ్మిళిత ప్లాట్‌ఫాంగా కూ (Koo) విభిన్నమైన యూజర్ల జనాభాను కలిగి ఉంది. ఇందులో కవిత్వం, సాహిత్యం, కళ మరియు సంస్కృతి, క్రీడలు, చలనచిత్రాలు, ఆధ్యాత్మికత ద్వారా తమను తాము చురుకుగా వ్యక్తీకరించే మిలియన్ల మంది క్రియేటర్లు ఇందులో ఉన్నారు. టాపిక్‌ల ద్వారా యూజర్లు తమకు అత్యంత సందర్భోచితమైన కంటెంట్‌ను మాత్రమే వీక్షించగలుగుతారు. దాని ద్వారా కూలో వారి ప్రయాణాన్ని మరింత అర్థవంతంగా సాగుతుంది.
కూ (Koo)లో జరిగే అనేక సంభాషణల మధ్య ప్లాట్‌ఫాం లోని ఫీడ్ ద్వారా స్క్రోల్ చేయడానికి బదులుగా యూజర్ల ఆసక్తి మరియు ప్రాధాన్యతల ప్రకారం కంటెంట్‌ని ఎంచుకుని, ఎంచుకోవడానికి టాపిక్స్ వారి మార్గాన్ని సులభతరం చేస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు మరియు సమాచారాన్ని కోరుకునే యూజరు (ఉదాహరణకు) టీకా, జీవనశైలి వ్యాధులు, వైద్య నిపుణుల నుండి ఆరోగ్య సంరక్షణ చిట్కాలు మొదలైన వాటికి సంబంధించిన అన్ని సంబంధిత కూలను వినియోగించుకోవడానికి టాపిక్స్ ట్యాబ్‌లోని 'ఆరోగ్యం' విభాగాన్ని క్లిక్ చేయవచ్చు.
కూ (Koo) సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా మాట్లాడుతూ, “10 భారతీయ భాషలలో టాపిక్‌లను ప్రారంభించిన మొదటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం గా మేము గర్విస్తున్నామన్నారు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు ఆసక్తి ఉన్న కంటెంట్‌ను కనుగొనవచ్చును. మరియు సంబంధిత యూజర్ల ద్వారా చాలా మంది క్రియేటర్‌లను కనుగొనడంలో కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. మేము ప్రతి నెలా 20 లక్షలకు పైగా టాపిక్‌లను అనుసరిస్తున్నాము. మేము చాలా ఉన్నత స్థాయి ఖచ్చితత్వాన్ని కలిగి ఉన్న సంక్లిష్ట మిషన్ లెర్నింగ్ నమూనాల ద్వారా టాపిక్ వర్గీకరణను సాధిస్తాము. ఇంత తక్కువ వ్యవధిలో ఇటువంటి సంక్లిష్టతను సాధ్యం చేసినందుకు మేము గర్విస్తున్నాము. ఈ సంవత్సరం చివరి నాటికి ప్రతి నెలా 100 మిలియన్లకు పైగా ఈ టాపిక్ ఫీచర్ వినియోగం పెరుగుతుందని నేను అంచనా వేస్తున్నానన్నారు.
ఒక సంవత్సరం క్రితమే 10 లక్షల మార్క్ ను సాధించి, హైపర్ గ్రోత్ యొక్క కాలాన్ని సూచించింది. “భవిష్యత్తులో 100 లక్షల డౌన్లోడ్ లను సాధించాలని మరియు ప్రపంచంలోని ప్రతిచోటా స్థానికంగా మాట్లాడేవారిని శక్తివంతం చేయగల సాంకేతికతను రూపొందించాలని కూ (koo) కోరుకుంటుంది. మన భారతదేశం లాగా, ప్రపంచంలోని 80% మంది స్థానిక భాషలో మాట్లాడతారు. భారతదేశం నుండి ఒక వేదికగా కూ వివిధ భాషా సమాజాల యొక్క సూక్ష్మ నైపుణ్యాలను మరియు నీతిని అర్థం చేసుకుంటుంది. అలాగే మా సాంకేతికత ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని గర్వించదగినదిగా చేయగలదని బిదావత్కా చెప్పుకొచ్చారు.
పది (10) భాషల్లోని యూజర్లు ఏ సమయంలోనైనా కూ (Koo)లో ఎలాంటి సంభాషణలు జరుపుతున్నారో ఆయా అంశాలు ప్రతిబింబిస్తాయి. అత్యంత జనాదరణ పొందిన అంశాలలో వివిధ వర్గాలు (ఆరోగ్యం, విద్య, పర్యావరణం, సినిమాలు, క్రీడలు వంటివి), ప్రముఖ వ్యక్తులు, సంస్థలు (ఇస్రో, ఐయంఫ్... మొదలైనవి), స్థలాలు, (రాష్ట్రాలు, నగరాలు, వార్తల్లో ఉన్న దేశాలు) మరియు ఇతర ట్రెండింగ్ టాపిక్‌లు.