బెంగాలీ, మరాఠీ, పంజాబీ, తెలుగుతో సహా 10 కొత్త భాషా అవకాశాలను జోడించిన లింక్డ్‌ఇన్

ఐవీఆర్

గురువారం, 26 సెప్టెంబరు 2024 (23:24 IST)
ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది సభ్యులు పరిజ్ఞానం, అవకాశాల కోసం లింక్డ్‌ఇన్ వైపు చూస్తుండటంతో, ప్రపంచంలోని అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్క్ మరింత సమగ్రమైన మరియు విభిన్నమైన ప్రొఫెషనల్ వర్క్‌ఫోర్స్‌ను ప్రోత్సహించడానికి 10 కొత్త భాషా అవకాశాలను జోడించింది. కొత్త భాషా అవకాశాలలో వియత్నామీస్, గ్రీక్, పర్షియన్, ఫిన్నిష్, హిబ్రూ, హంగేరియన్; మరియు 4 భారతీయ ప్రాంతీయ భాషలు బెంగాలీ, మరాఠీ, తెలుగు మరియు పంజాబీ వున్నాయి. 
 
భారతదేశంలోని లింక్డ్ఇన్ సభ్యుల సంఖ్య 135 మిలియన్లను అధిగమించింది, ఎంగేజ్‌మెంట్ రేట్లు ఇయర్ ఆన్ ఇయర్ 20% పెరుగుతున్నాయి. ఈ కొత్త జోడింపులు భారతదేశంలో డిమాండ్ పెరుగుతున్న తరుణంలో హిందీతో సహా ఐదు భారతీయ ప్రాంతీయ భాషలకు లింక్డ్‌ఇన్ మద్దతును అందుబాటులోకి తెస్తుంది. ఈ భాషలను జోడించడం ద్వారా, లింక్డ్‌ఇన్ ప్లాట్‌ఫారమ్‌పై భాషా అవరోధాలను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది, మరింత మంది వ్యక్తులు లోతైన వృత్తిపరమైన గుర్తింపులను ఏర్పరచుకోవడానికి మరియు తమ నెట్‌వర్క్‌లతో మరింత అర్థవంతంగా పాల్గొనడానికి అనుమతిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు