హైదరాబాద్: లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ భారతదేశంలోని హైదరాబాద్‌లో తమ కొత్త ఏఐ లీడ్‌గా శిరీష్ తాటికొండను నియమించినట్లు ప్రకటించింది. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిరీష్ కీలక పాత్ర పోషించనున్నారు, అత్యాధునిక ఏఐ సొల్యూషన్స్ అభివృద్ధిని నడిపించనున్నారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ లో రెండు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని శిరీష్ తీసుకువచ్చారు, వాల్‌మార్ట్ గ్లోబల్ టెక్ నుండి చేరారు. అక్కడ అతను వాల్‌మార్ట్ డేటా వెంచర్స్‌లో డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ గ్రూప్‌కు నాయకత్వం వహించారు. వాల్‌మార్ట్‌కు ముందు, ఆయన టార్గెట్ కార్పొరేషన్ మరియు ఐబిఎం రీసెర్చ్‌లలో సీనియర్ గా విధులను నిర్వహించారు, అక్కడ ఆయన పెద్ద ఎత్తున ఏఐ ప్లాట్‌ఫారమ్‌లను రూపొందించారు. కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ తో నడిచే అప్లికేషన్‌లను తీర్చిదిద్దారు.
ఒహియో స్టేట్ యూనివర్శిటీ నుండి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీని శిరీష్ పొందారు. ఆయన 30కి పైగా పీర్-రివ్యూడ్ ప్రచురణలను చేయటంతో పాటుగా ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లో 10కి పైగా పేటెంట్లను కలిగి ఉన్నారు. తన కొత్త బాధ్యతలలో, శిరీష్ హైదరాబాద్‌లోని లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్‌లో ఏఐ బృందానికి నాయకత్వం వహిస్తారు, స్థానికంగా సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తారు. లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ యొక్క కొన్ని ఏఐ వినియోగ కేసులకు నాయకత్వం వహిస్తారు.
లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్‌లోని చీఫ్ డేటా మరియు అనలిటిక్స్ ఆఫీసర్ రణిల్ బోటేజు మాట్లాడుతూ: “శిరీష్ తనతో పాటుగా విస్తృత స్థాయి సాంకేతిక నైపుణ్యం మరియు వ్యూహాత్మక నాయకత్వం ను తీసుకువస్తున్నారు. మేము మా ఉత్పత్తులు మరియు సేవలలో ఏఐని వినియోగించటం కొనసాగిస్తున్నందున స్కేలబుల్ ఏఐ ప్లాట్‌ఫారమ్‌లను నిర్మించడంలో మరియు కొలవగల వ్యాపార విలువను అందించడంలో అతని అనుభవం కీలక పాత్ర పోషించనుంది" అని అన్నారు.
లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ & మేనేజింగ్ డైరెక్టర్ శిరీష వోరుగంటి మాట్లాడుతూ, “శిరీష్ యొక్క నియామకం లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ వద్ద మా ప్రయాణంలో ఒక ఉత్తేజకరమైన ముందడుగుగా నిలుస్తుంది. ఇక్కడ మేము వేగవంతంగా వృద్ధి చెందుతున్నాము, భావితరపు వినియోగదారుల అనుభవాలను అభివృద్ధి చేస్తున్నాము. గ్రూప్ వద్ద మా తదుపరి దశ వృద్ధి వ్యూహాన్ని రూపొందించడానికి అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలతో పాటు, ఏఐని ఉపయోగించి మా వినూత్న అప్లికేషన్‌లను ముందుకు తీసుకువెళ్లడంలో శిరీష్ ముఖ్యమైన పాత్ర పోషించనున్నారు ” అని అన్నారు.
లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ వద్ద ఏఐ లీడ్ శిరీష్ తాటికొండ మాట్లాడుతూ, “ఇటువంటి కీలకమైన సమయంలో లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్‌లో చేరడం నాకు చాలా ఆనందంగా ఉంది. బాధ్యతాయుతమైన ఏఐ ఆవిష్కరణ పట్ల గ్రూప్ యొక్క బలమైన నిబద్ధత, డేటా, ఏఐలో దాని వ్యూహాత్మక పెట్టుబడి ఈ అవకాశాన్ని ఆక్షర్షణీయంగా మార్చాయి. మా విభిన్న కస్టమర్ బేస్ కోసం నిజమైన ప్రభావాన్ని సృష్టించే పరిష్కారాలను అందించడానికి, సంస్థ అంతటా ప్రతిభావంతులైన బృందాలతో కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను” అని అన్నారు.