వంట గ్యాస్ సిలిండర్ ధరలను సవరించిన చమురు కంపెనీలు..

వరుణ్

గురువారం, 1 ఆగస్టు 2024 (11:43 IST)
వంట గ్యాస్ సిలిండర్ ధరలను చమురు కంపెనీలు సవరించాయి. ఈ సవరణలో భాగంగా వాణిజ్య సిలిండర్ ధరపై రూ.8.50 పైసలు చొప్పున స్వల్పంగా భారం మోపాయి. కొత్త నెల ఆగస్టు ప్రారంభంకావడంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరలను సవరించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.8.50 మేరకు పెంచాయి. సవరించిన ధర నేటి నుంచి అంటే ఆగస్టు ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. 
 
ఈ సవరించిన ధరల ప్రకారం... ఢిల్లీలో 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.6.50 మేరకు పెరిగి రూ.1646 నుంచి రూ.1652.50కు చేరింది. కోల్‌కతాలో రూ.8.50 మేర పెరిగి రూ.1764.50కి చేరగా, ముంబైలో 1605, చెన్నైలో రూ.1817గా ధరలు ఉన్నాయి. రాష్ట్రాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. 
 
అయితే, గృహ అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఈ ధరలను యథాతథంగానే చమురు కంపెనీలు ఉంచాయి. ప్రస్తుతం ఈ ధరలు ఢిల్లీలో రూ.803, కోల్‌కతాలో 829, ముంబైలో రూ.803, చెన్నైలో 818.50గా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు