ఈ రోజు మ్యాజికల్ లవ్ సాంగ్ కలలే కలలే రిలీజ్ చేశారు. ఈ పాటను చైతన్య భరద్వాజ్ క్లాసీ ట్యూన్ తో కంపోజ్ చేయగా, కపిల్ కపిలన్ అందంగా పాడారు, భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్ అందించారు. 'కలలే కలలే' పాట ఎలా ఉందో చూస్తే - కలలే కలలే కనులకు నువు కనబడి కలలే, కథలే మొదలే వివరములే తెలియాలే, నా గుండెకేదో కబురే నీ వల్లే అందిందే, నీ చుట్టు చుట్టు తిరిగేలా చేసిందే, నాతోటి ఉండే మనసే నా మాటే వినకుందే, నీతోటి జట్టే కడుతోందే కడుతోందే, అందాల మాయ కళ్లే కాదా, ఊసులేవో నాలో పూసగుచ్చేలా నన్నే అద్దంలో చూస్తుంటే నిన్నే చూపిస్తోందే, రోజంతా అద్దంతో ఇబ్బందే, యే నీ గుండే నాలోనే అందంగా దాక్కుందే, నాక్కొంచెం చోటైనా లేకుందే..' అంటూ మంచి లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట.