ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి రోడ్డు, రైలు మార్గాన్ని ఎంచుకుంటే మూడు గంటల సమయం పడుతుంటే.. హైపర్ లూప్ విధానం ద్వారా అరగంట సమయమే పడుతుంది. ఇంకా హైపర్ లూప్ ఏర్పాటు కోసం యూఎస్‌కు చెందిన వర్జిన్ హైపర్ లూప్ వన్ సంస్థను సంప్రదించామని మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, నెవడాలో ఉన్న వర్జిన్ హైపర్ లూప్ వన్ టెస్ట్ సైట్ ను సందర్శించారని, కంపెనీ సీఈఓ రాబ్ లాయిడ్‌తో ఆయన చర్చించారని మహారాష్ట్ర సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో అతి త్వరలోనే హైపర్ లూప్‌పై అధ్యయనం చేసేందుకు సంస్థ ఇంజనీర్లు భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది.