దీనిని "గొప్ప సహకారం" అని అభివర్ణించిన మంత్రి, ఎయిర్‌బస్, మహీంద్రా కలిసి రావడం వల్ల ప్రపంచ విమానయాన తయారీ రంగంలో భారతదేశం స్థానం బలపడుతుందని అన్నారు."భారత విమానయాన పరిశ్రమకు ఇది ఒక మైలురాయి సహకారం. తయారీ కేంద్రంగా భారతదేశం సామర్థ్యంపై పెరుగుతున్న ప్రపంచ విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తుంది" అని వ్యాఖ్యానించారు.
200కు పైగా ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు ఇప్పటికే పర్యావరణ వ్యవస్థలో భాగమయ్యాయని, విమానాలు-హెలికాప్టర్ల కోసం వివిధ భాగాలను తయారు చేస్తున్నాయని మంత్రి వెల్లడించారు.