ఎలక్ట్రిక్ ఎస్.యు.వి eZS కారును ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన ఎంజీ

సోమవారం, 15 ఏప్రియల్ 2019 (21:42 IST)
న్యూ ఢిల్లీ: ఎంజీ (మోర్రీస్ గరాజేస్) తాజాగా ప్రపంచ మార్కెట్లో త్వరలో ప్రవేశ పెట్టనున్న తమ గ్లోబల్ ప్యూర్ ఎలక్ట్రిక్ SUV అయిన ఎంజీ eZSను ప్రపంచ మార్కెట్ కోసం ఆవిష్కరించింది. భారతదేశంలో ఈ సంవత్సరం చివర్లో డిసెంబర్ కల్లా ప్రవేశ పెట్టనున్నది, ఎంజీ eZS భారతదేశంలో మొదటి ప్రపంచ స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ SUVలలో ఒకటిగా ఉంటుంది.
    
పర్యావరణం పరిగణనలోకి వెళ్లాలని కోరుకునే వ్యక్తుల కోసం పర్ఫెక్ట్ కారు ఈ ఎంజీ eZS EV, ఇందులో ఉన్న కనెక్టెడ్ మొబిలిటీ ఫీచర్స్‌తో తాజా ఆధునిక వాహనాన్ని కోరుకుంటున్నవారికీ ఇది ఎంతో పరిపూర్ణ కార్. భారతదేశంలో ఈ సంవత్సరం చివర్లో డిసెంబర్ కల్లా ప్రవేశ పెట్టనున్నది మరియు యుకే, జర్మనీ, ఆస్ట్రేలియా, థాయిలాండ్ మరియు మిడిల్ ఈస్ట్ వంటి ఇతర మార్కెట్లలో కూడా ఒకేసారి ప్రవేశ పెట్టనున్నారు.
 
“ఒక మోడరన్ డిజైన్ మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన, ఈ ఎంజీ eZS భారతదేశంలో పర్యావరణ అనుకూలమైన పరిష్కారాలలో ఒక నూతన అధ్యాయనం కానున్నది. ఒకవైపు పెట్రోల్ వెర్షన్ ఎంజీ ZS ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రసిద్ధ ఎంపికగా కావడం విశేషం, ఈ సంవత్సరం చివరి నాటికి లాంచ్ కానున్న జీరో ఎమిషన్ విద్యుత్ వాహనం భారతదేశంలో వినియోగదారులకు అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ మోటరింగ్ తీసుకొస్తుందని మేము విశ్వసిస్తున్నాము” అని అన్నారు రాజీవ్ చాబా, ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, ఎంజీ మోటార్ ఇండియా.
 
"మేము వాహనాన్ని ప్రారంభించిన సమయానికి, ఇటీవల ప్రకటించిన FAME II పథకం కింద EVలకు చాలా అవసరమైన సబ్సిడీలను మరియు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది, తద్వారా పర్యావరణ అనుకూలమైన మొబిలిటీ సొల్యూషన్స్ ద్వారా ప్రజలు ప్రోత్సహించబడతారు. eZS యొక్క వివరణలు మరియు లక్షణాల గురించి మరిన్ని వివరాలు తరువాత దశలో ప్రకటించబడతాయి" అని చాబా చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు