సుకుమార్ భార్య బిజినెస్ స్టార్ట్ చేసింది.... ఏంటో తెలిస్తే షాకే...

సోమవారం, 15 ఏప్రియల్ 2019 (19:45 IST)
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం ఆవశ్యకం అయింది. ప్రస్తుత తరుణంలో లాండ్రీకార్ట్ వారికో వరంగా ఉపయోగపడుతుంది అని అన్నారు సమంత అక్కినేని. ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ సతీమణి తబితా సుకుమార్… అలేఖ్య, గిరిజ, శరత్‌లతో కలిసి నెలకొల్పిన లాండ్రీకార్ట్ సంస్థ మొబైల్‌యాప్ సర్వీస్‌ను ఆదివారం హైదరాబాద్‌లో సమంత ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా లాండ్రీకార్ట్ వ్యవస్థాపకురాలు తబితా సుకుమార్ మాట్లాడుతూ ” ఏడాదిన్నర పాటు గ్రౌండ్‌వర్క్ చేసిన తర్వాత గత ఏడాది జూన్‌లో లాండ్రీకార్ట్‌ను ప్రారంభించాం. సినిమా నేపథ్యంతో ముడిపడిన సంస్థ కాదిది. మధ్యతరగతి వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని తక్కువ వ్యయంతో సర్వీసులను అందించాలని ప్రారంభించాం. వ్యాపారం చేయాలనే ఆలోచనతో కాకుండా సేవ చేస్తూనే చాలామందికి ఉపాధి కల్పించాలనే లాండ్రీకార్ట్‌ను ప్రారంభించాం. 
 
ఇందులో ప్రీమియం లాండ్రీ, డ్రైక్లీనింగ్ పేరుతో రెండు రకాల సర్వీసులను అందిస్తున్నాం. ప్రీమియం లాండ్రీలో రోజువారి దుస్తులను  శుభ్రం చేస్తాం. డ్రైక్లీనింగ్‌లో బ్రాండెడ్ దుస్తుల్లాంటి ఖరీదైన వాటిని శుభ్రంచేస్తాం. ఇతర వ్యాపార సంస్థలతో భిన్నంగా ఏదైనా చేయాలనే దీనిని ప్రారంభించాం. మార్కెట్‌లో ప్రస్తుతమున్న లాండ్రీ సర్వీసులలో దుస్తులను ఇస్తే తిరిగి తీసుకోవడానికి వారం రోజులు దాటుతుంది. అంత సమయం తీసుకోకుండా కేవలం 48 గంటల్లోనే వినియోగదారులుకు దుస్తులను మా లాండ్రీకార్ట్ ద్వారా అందజేస్తున్నాం. 
 
ప్రస్తుతం పది శాఖలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఎక్కైడనా డెలివరీ చేసే సౌకర్యం ఉంది. ఈ వ్యాపార సంస్థను ప్రారంభించాలని అనుకున్నప్పటి నుండి నా భర్త సుకుమార్ ఆర్థికంగా అండగా నిలుస్తూ చక్కటి ప్రోత్సాహాన్ని అందించారు. మా సంస్థను ప్రమోట్ చేయడంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ చక్కటి తోడ్పాటును అందించారు. సహ వ్యవస్థాపకులు శరత్, అలేఖ్య, గిరిజ సహాయసహకారాలతో ముందుకు నడిపిస్తున్నాను. రెస్టారెంగ్, డిజైనింగ్ కాకుండా ఏదైనా యూనిక్‌ చేయాలని లాండ్రీకార్ట్‌ను స్థాపించాం” అని తెలిపారు.
 
సమంత అక్కినేని మాట్లాడుతూ “లాండ్రీ కార్ట్ గురించి వినగానే వెంటనే యాప్ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అనిపిస్తున్నది. ఉద్యోగాలు చేసేవారికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. కొత్తగా వ్యాపారం చేయాలని ఉపాధిని కల్పించాలని ఆలోచించేవారికి ఈ లాండ్రీకార్ట్ ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. డిజైనింగ్ వ్యాపారం చేస్తే ఇప్పటికే ఉన్న వందలాది మందితో పాటు మరొకరు పెరుగుతారు. అలా కాకుండా భిన్నంగా లాండ్రీకార్ట్‌ను స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించడం అభినందనీయం. యాప్ ద్వారా అందరి నమ్మకాన్ని చూరగొంటూ లాండ్రీ సర్వీసులను అందించడం బాగుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో లాండ్రీకార్ట్ వ్యవస్థాపకులు శరత్, అలేఖ్య, గిరిజ, నటుడు నోయాల్‌తో పాటు లాండ్రీకార్ట్ సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు