సామాజిక మరియు వ్యక్తిగత కారణాల కోసం భారతదేశంలో అతి పెద్ద క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన మిలాప్ ఇప్పుడు స్ఫూర్తిదాయక వీడియో ప్రచారాన్ని అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 2023 ను పురస్కరించుకుని విడుదల చేసింది. ఆరోగ్యసంరక్షణ రంగానికి వెన్నుముకగా నర్సులు అందిస్తోన్న అసాధారణ తోడ్పాటును గుర్తిస్తూ ఈ సంవత్సర నేపథ్యం మన నర్సులు, మన భవిష్యత్ ఆధారంగా తీర్చిదిద్దారు.
ఈ వీడియో ప్రచారాన్ని అవిశ్రాంతంగా, జాగ్రత్తగా, నిస్వార్థంగా సేవలనందిస్తున్న నర్సులకు తగిన గుర్తింపును తీసుకువచ్చే రీతిలో తీర్చిదిద్దారు. రోగి చికిత్స ప్రక్రియలో అత్యంత కీలకమైన పాత్రను నర్సులు పోషిస్తుంటారు. డాక్టర్లు సైతం ఈ నర్సుల నైపుణ్యం, అనుభవం, అంకితభావాన్ని ప్రశంసిస్తే, జూనియర్ డాక్టర్లు వీరి దగ్గర విలువైన పాఠాలనూ నేర్చుకుంటుంటారు.
మిలాప్ అధ్యక్షుడు మరియు కో-ఫౌండర్ శ్రీ అనోజ్ విశ్వనాథన్ ఈ వీడియో ప్రచారం గురించి మాట్లాడుతూ నర్సులకు మేము వందనాలనర్పిస్తున్నాము. రోగి కోలుకోవడంలో వీరి తోడ్పాటు, అవిశ్రాంత ప్రయత్నాలు అనన్య సామాన్యం. రోగుల శారీరక, మానసిక సౌకర్యం మొదలు, అవసరమైన వైద్య చికిత్సల అమలు, రోగులు, వారి బంధువులకు తగిన సమాచారం అందించడంలో వారి పాత్ర మరువలేము. ఈ ప్రచారం ద్వారా వారి ప్రయత్నాలను వేడుక చేస్తున్నాము అని అన్నారు.
అద్భుతమైన నర్సు, రిటైర్డ్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ పర్సన్, 75 ఏళ్ల వయసు కలిగిన, హైదరాబాద్‌లోని రెయిన్‌బో హాస్పిటల్‌కు చెందిన శ్రీ హరిదాస్, సేవలను ఈ వీడియోలో ఒక రోజంతా ఒడిసిపట్టారు. ప్రతికూల పరిస్థితిలలో సైతం నర్సులు చూసే అభిమానం, నిబద్ధతను దీనిలో ఒడిసిపట్టారు. మిలాప్ ఇప్పుడు హాస్పిటల్స్, హెల్త్‌కేర్ ఇనిస్టిట్యూషన్‌లు ఈ వీడియోను అంతర్గతంగా పంచుకోమని కోరుతూనే, ఈ అన్‌సంగ్ హీరోల పట్ల అవగాహన మెరుగుపరచడంతో పాటుగా నర్సులను ప్రశంసించాల్సిందిగా కోరుతుంది.