కరోనా వైరస్ వ్యాప్తితో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం వల్ల బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి ఊరట కలిగిస్తూ కేంద్రం మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వడ్డీపై వడ్డీ, మారటోరియం గడువు పొడిగింపు వంటి అంశాలపై సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంకులు పలు విషయాలు తెలిపాయి.
మారటోరియం వ్యవధి 6 నెలలకు మించితే మొత్తం చెల్లింపులు తీరుపై ప్రభావం చూపుతుందని స్పష్టత చేశాయి. వడ్డీపై వడ్డీ మాఫీ చేయడమే కాకుండా ఇతర ఊరట కల్పించినా భారత ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్ రంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని కేంద్ర సర్కారు తెలిపింది.