ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2023 రిలీజ్ - టాప్-10 కుబేరుల్లో అంబానీ

గురువారం, 23 మార్చి 2023 (12:46 IST)
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన పారిశ్రామివేత్తగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోమారు నిలిచారు. 8100 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో నిన్నామొన్నటివరకు ఉన్న అదానీ గ్రూపు కంపెనీ అధిపతి గౌతం అదానీ ఏకంగా 23వ స్థానానికి పడిపోయారు. తాజాగా ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2023 పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 
 
టాప్-10 జాబితాలో ముఖేష్ అంబానీ తొమ్మిదో స్థానంలో నిలిచారు. పైగా, ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు ముఖేష్ అంబానీ కావడం గమనార్హం. అంబానీ నికర సంపద 82 బిలియన్ డాలర్లుగా హురున్ పేర్కొన్నారు. నిజానికి గత యేడాదితో పోలిస్తే అంబానీ సంపద 20 అంటే 21 బిలియన్ డాలర్లు తగ్గింది. 
 
మరోవైపు అదానీ సంపద భారీగా క్షీణించింది. దీంతో అదానీని వెనక్కి నెట్టేసిన ముఖేష్ అంబానీ ఇపుడు భారతదేశంలో అత్యంత సంపన్నుడుగా నిలిచారు. కాగా, గతంలో హిండెన్‌బర్గ్ వెలువరించిన నివేదిక ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో అదానీ అస్తులు మంచు గడ్డల్లా కరిగిపోయాయి. ఏకంగా 140 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు