ఆనంద్‌తో ఇషా అంబానీ నిశ్చితార్థం

సోమవారం, 7 మే 2018 (13:00 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థం ముగిసింది. ప్రముఖ ఫార్మా ఇండస్ట్రియలిస్ట్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్‌తో ఈ నిశ్చితార్థం జరిగింది. ఇది ఈషా మహాబలేశ్వరంలోని ఓ గుడిలో ఉంగరాలు మార్చుకున్నట్లు సమాచారం. ఆనంద్‌, ఇషాలు చిన్ననాటి స్నేహితులు.
 
కొద్దిరోజుల క్రితం మహాబలేశ్వరంలోని ఓ గుడిలో ఆనంద్‌, ఇషాకు ప్రపోజ్‌ చేశారు. ఇషా కూడా అంగీకారం తెలపడంతో అక్కడే ఉంగరాలు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వారి వారి కుటుంబాలకు విషయం చెప్పారు. మఖేష్ కుమారుడు ఆకాశ్‌ అంబానీ, శ్లోకా మెహతాల వివాహం కంటే ముందే ఆనంద్‌, ఇషాల వివాహం జరిగే అవకాశం ఉంది. 
 
అయితే, ఆనంద్ - ఇషాల పెళ్లి తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. పైగా, దీనిపై ముఖేష్, అజయ్ కుటుంబ సభ్యులు ఓ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా, ఆనంద్‌ పిరమల్ దేశంలో పిరామల్‌ ఈ-స్వాస్థ్య, పిరామల్‌ రియాల్టీ అనే స్టార్టప్ కంపెనీలను ప్రారంభించి, విజయవంతంగా నడుపుతున్న విషయం తెల్సిందే. ఇషా రిలయన్స్ జియో, రిలయన్స్‌ రిటైల్‌ బోర్డుల్లో సభ్యురాలిగా ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు