రిటైల్ టచ్ పాయింట్స్ పెంపుతో 2025లో 40 శాతం అభివృద్ధికై మైట్రైడెంట్

ఐవీఆర్

శుక్రవారం, 9 ఆగస్టు 2024 (23:00 IST)
ట్రైడెంట్ గ్రూప్ యొక్క ఫ్లాగ్‌షిప్ డొమెస్టిక్ హోమ్ ఫర్నిషింగ్ బ్రాండ్ అనగానే మన అందరికి గుర్తుకు వచ్చే బ్రాండ్ మైట్రైడెంట్. అలాంటి మైట్రైడెంట్ న్యూఢిల్లీలోని ఏరోసిటీలో అందాజ్‌లో ఫాల్-వింటర్ '24 కలెక్షన్‌ను ఆవిష్కరించింది. ట్రైడెంట్ గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్ గౌరవనీయులు డాక్టర్ రాజిందర్ గుప్తా... ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాన్ని నిర్వహించారు. హోమ్ కమింగ్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 1500 మందికి పైగా రిటైలర్లు హాజరయ్యారు.
 
రాబోయే ఆర్థిక సంవత్సరంలో మైట్రైడెంట్ గణనీయమైన వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టకుంది. అందులో భాగంగా రిటైల్ ఉనికిని విస్తరించడం, ఇప్పటికే ఉన్న మార్కెట్‌లలో తన పట్టును మరింత బలోపేతం చేయాలని నిశ్చయించుకుంది. రాబోయే 3 సంవత్సరాలలో తన ఆదాయాన్ని రూ. 1000 కోట్లకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండింటిలోనూ ఉనికిని పెంచుకోవడం ద్వారా మెట్రో నగరాలు, టైర్ 2 మరియు 2 నగరాల్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
 
"రాబోయే రోజుల్లో మేము గణనీయమైన వృద్ధిని సాధించాలని లక్ష్యంగా చేసుకున్నాం. కొత్త మార్కెట్‌లలోకి చొచ్చుకుపోవటం, ఇప్పటికే ఉన్న వాటిపై మా పట్టును బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నాము. 'ఘర్ ఘర్ మే మైట్రైడెంట్' అనే లక్ష్యంతో మరింత ముందుకు వెళ్తున్న మేము, ప్రతి రిటైల్‌లో అందుబాటులో ఉన్న మైట్రైడెంట్ ఉత్పత్తులతో భారతదేశం అంతటా చొచ్చుకుపోవాలని కోరుకుంటున్నాము. తద్వారా రాబోయే రోజుల్లో 40శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. మా ఆదాయాన్ని రెట్టింపు చేయడం, మా మార్కెట్ వాటాను పెంచుకోవాలని అనుకుంటున్నాం” అని అన్నారు మైట్రైడెంట్ ఛైర్‌పర్సన్ నేహా గుప్తా బెక్టర్.
 
ఈ సందర్భంగా మైట్రైడెంట్ సీఈఓ శ్రీ రజనీష్ భాటియా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... “మా రిటైల్ టచ్‌పాయింట్‌లను రెట్టింపు చేయడం ద్వారా విస్తృతమైన వినియోగదారులకు మైట్రైడెంట్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. మేము పెద్ద-ఫార్మాట్ స్టోర్‌లలో మా ఉనికిని విస్తరించడంపై దృష్టి పెడుతున్నాము. తద్వారా ఈ ఏడాది అద్భుతమైన వ్యాపారాన్ని చేయాలని నిశ్చయించుకున్నాం. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో మా స్థానాన్ని బలోపేతం చేయడం మా వ్యూహం. ప్రస్తుతం, మా ఉత్పత్తులు దాదాపు 5,000 అవుట్‌‌లెట్‌‌లలో అందుబాటులో ఉన్నాయి. రాబోయే మూడేళ్లలో ఈ సంఖ్యను 10,000కి రెట్టింపు చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము అని అన్నారు ఆయన.
 
అత్యంత అట్టహాసంగా నిర్వహించిన ఈ ఈవెంట్ సరికొత్త కలెక్షన్‌ను ఆవిష్కరించింది. వేడుకకు హాజరైన రిటైలర్‌లను మంత్రముగ్దులను చేసింది. కొత్త ఫాల్/వింటర్ 2024 కలెక్షన్ లో పండుగలున్నాయి. అలాగే ప్రధానంగా రోడ్ టు జైపూర్, సంస్కృతి, ఎర్త్ లవర్ కలెక్షన్‌లు లాంటి ఎన్నో అద్భుతమైన మరియు ప్రతి ప్రదేశానికి స్ఫూర్తినిచ్చేలాంటివి మరింతగా ఎలివేట్ అయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు