పాన్ కార్డు లింకేజీపై జరిమానా... పాన్ కార్డుకు ఆధార్ నంబరు లింకు చేయకపోతే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జరిమానా చెల్లించాల్సివస్తుంది. మొదటి ముూడు నెలలు రూ.500, ఆ తర్వాత 9 నెలలు రూ.1000 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 2023 మార్చి 31వ తేదీలోగా ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డు చెల్లదు. ఆ పాన్ కార్డు ఇన్ యాక్టివ్‌గా మారుతుంది. ఆ పాన్ కార్డు లావాదేవీల్లో ఉపయోగించడానికి వీల్లేదు.
జీఎస్టీ మార్పు... పరోక్ష పన్నులు, కష్టమ్స్ కేంద్ర బోర్డు రూ.20 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వ్యాపారులను బీ2బీ లావాదేవీల కోసం ఎలక్ట్రానికి ఇన్వాయిస్‌లను తీయాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు రూ.50 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న వ్యాపారులకే ఇది వర్తిస్తూ వచ్చింది. వీటితో పాటు అనేక నిబంధనలు అమల్లోకి వచ్చాయి.