ఉద్యోగుల పని గంటల పెంపు అంశంపై పలువురు కార్పొరేట్ దిగ్గజాలు చేస్తున్న వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చింది. పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది.
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన సహాయ మంత్రి శోభా కరండ్లాజే ఈమేరకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కార్మికుల అంశం ఉమ్మడి జాబితాలో ఉందని, ఆ చట్టాల అమలును రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం వారి అధికార పరిధిలో నిర్వహిస్తాయని తెలిపారు.