సెప్టెంబరు నెల మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఆ తర్వాత అక్టోబరు నెలలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే, అక్టోబరు నెలలో ఏకంగా 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. ఈ విషయాన్ని బ్యాంకు ఖాతాదారులు దృష్టిలో ఉంచుకోవాలని బ్యాంకు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
ఈ నెలలో దసరా, నవరాత్రి, దీపావళి పండుగలు వస్తున్నాయి. అలాగే, దేశంలోని పలు రాష్ట్రాల్లో స్థానిక సెలవులు ఉన్నాయి. దీంతో మొత్తం 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఈ సెలవుల వివరాలను పరిశీలిస్తే,
అక్టోబరు 1 - అర్థ వార్షిక ముగింపు సెలవు (గ్యాంగ్ టక్)
అక్టోబరు 2 - ఆదివారం, గాంధీ జయంతి