2016లో పెద్ద నోట్ల రద్దు సందర్భంగా కేంద్రం రూ.2 వేలు, రూ.200 నోట్లను విడుదల చేసింది. 2019లో కేంద్రీయ బ్యాంకు రూ.100 నోట్లను సరికొత్త రంగులో ముద్రించినప్పటికీ.. పాత నోట్లు ఇప్పటికీ సర్కులేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రూ.100 రూ.10, రూ.5 సహా పాత నోట్లకు మార్చి లేదా ఏప్రిల్ నెల నుంచి ఆర్బీఐ మంగళం పాడనున్నట్టు తెలుస్తోంది.
ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బి. మీనా ఇవాళ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పాత నోట్లను సర్కులేషన్ నుంచి ఉపసంహరించుకోనున్నట్టు వెల్లడించారు. జిల్లా పంచాయత్‌లోని నేత్రావతి హాల్‌లో డిస్ట్రిక్ లీడ్ బ్యాంకు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజలు కాయిన్లను అంగీకరించేందుకు సిద్ధంగా లేరనీ.. రూ.10 కాయిన్లను విడుదల చేసి 15 ఏళ్లు కావస్తున్న ఇప్పటికీ అవి చలామణిలోకి రావడం లేదని మీనా గుర్తు చేశారు.