ఫలితంగా నోట్ల రద్దుకు ముందు ప్రజల వద్ద ఉన్న సొమ్ముకంటే లక్షన్నర కోట్లు అధికంగా పోగు అయింది. స్వయంగా భారతీయ రిజర్వు బ్యాంకు ఈ విషయాన్ని వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. నోట్ల రద్దుకు ముందు, ఆ తర్వాత కూడా ఇంత దారుణమైన పరిస్థితులు లేవని ఆర్బీఐ తెలిపింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్ని విలువల నోట్లను కలుపుకుంటే మొత్తం రూ.19.3 లక్షల కోట్లు చలామణిలో ఉందని ఆర్బీఐ తెలిపింది. అయితే, తమ వద్దకు చేరిన డబ్బును ప్రజలు తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు వెనకాడుతుండడంతో రూ.18.5 లక్షల కోట్లు వారి వద్దే ఉండిపోయాయని భారత రిజర్వు బ్యాంకు అధికారులు చెపుతున్నారు.