విమానాల్లో సాధారణంగా 160 మంది ప్రయాణిస్తారు. కానీ ఆ విమానంలో ఒకే వ్యక్తి 4వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాడంటే నమ్ముతారా.. నమ్మితీరాల్సిందే. వివరాల్లోకి వెళితే.. ఇజ్రాయెల్‌కు చెందిన నేషనల్ ఎయిర్‌లైన్ ఈఐ ఏఐ బోయింగ్ 737 విమానం ఇటీవలే అక్కడి టెల్ అవివ్ బెన్ గురియాన్ ఎయిర్‌పోర్టు నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరి వెళ్లింది.
అయితే అంత పెద్ద విమానంలో ఒకే ఒక వ్యక్తి ప్రయాణించాడు. మొత్తం 4000 కిలోమీటర్ల దూరం అతను విమానంలో ఒంటరిగా ప్రయాణించాడు. అతను ఓ వ్యాపారవేత్త. తన చికిత్స కోసం అతను ఏకంగా ఓ విమానాన్నే బుక్ చేసుకున్నాడు. అందుకనే అందులో ఒంటరిగా ప్రయాణించాడు. రాను, పోను ఖర్చులన్నీ అతను చెల్లించాడు.