లెబనాన్‌లోని లిటానీ నదిలో నీళ్లు కలుషితం కావడం వల్ల సుమారు 40 టన్నుల చేపలు మృత్యువాత పడి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. లెబనాన్‌లో అతి పెద్ద నది అయిన లిటానీ కలుషితమవుతోందని ఎన్నో ఏళ్లుగా అక్కడి పర్యావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు, ఫ్యాక్టరీల వ్యర్థాలను నదిలోకి వదులుతుండటం వల్ల నీళ్లు పూర్తిగా కలుషితమైపోయాయి.