భారతదేశంలో అతిపెద్ద టాయ్ ట్రైన్ నేపథ్యంగా కలిగిన రెస్టారెంట్, ప్లాట్‌ఫామ్ 65ను వరంగల్‌లో నేడు ప్రారంభించింది. వినూత్నమైన డైనింగ్ కాన్సెప్ట్, ప్లాట్‌ఫామ్ 65 వరంగల్‌లోని భోజనప్రియులకు అద్వితీయమైన ఆహార అనుభవాలను అందించడంతో పాటుగా ఆహారాన్ని బొమ్మ రైలులో సరఫరా చేస్తుంది. వినియోగదారులు అధీకృత మల్టీ క్యుసిన్ రుచులను విలాసవంతమైన వాతావరణంలో అందిస్తుంది. ఈ నూతన ఔట్‌లెట్ వరంగల్ మార్కెట్‌లో రెస్టారెంట్ ప్రవేశానికి ప్రతీకగా నిలుస్తుంది.
ఆహార ఆభిమానుల నుంచి స్థిరంగా ప్రశంసలు పొందడంతో పాటుగా రెండేళ్లలో అత్యద్భుతమైన కస్టమర్ రివ్యూలను పొందిన ప్లాట్‌ఫామ్ 65 తమ శాఖలను తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలలో విస్తరిస్తోంది. ఇటీవలనే తమ ఏడవ ఔటలెట్‌ను బెంగళూరులో ప్రారంభించింది.
వరంగల్‌లో తమ నూతన ఔట్‌లెట్‌ను ప్రారంభించిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్లాట్‌ఫామ్ 65 తమ వినియోగదారులకు నోరూరించే ఆంధ్ర, తెలంగాణా, చైనీస్ వంటకాల రుచులను ఆస్వాదించే అవకాశం అందిస్తుంది. ఈ రెస్టారెంట్ వాతావరణాన్ని రైల్వే స్టేషన్ తరహాలో డిజైన్ చేశారు. ఇక్కడ సీట్లు రైల్ సీట్లను ప్రతిబింబించడంతో పాటుగా ప్రతి టేబుల్ బెంగళూరు, మైసూర్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, హైదరాబాద్, సంగారెడ్డి, విజయవాడ తదితర పేర్లను కలిగి ఉంటాయి. ఈ రైలు ఒకేసారి రెండు మీల్స్‌ను మోసుకుని వెళ్తుంది.
ఈ రెస్టారెంట్ ప్రారంభించిన సందర్భంగా తెలంగాణా రాష్ట్ర పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి వసతులు శాఖామాత్యులు ఎర్రబల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఈ తరహా థీమ్ రెస్టారెంట్‌లు వరంగల్‌కు మరింతమంది పర్యాటకులకు ఆకర్షిస్తాయి. ప్లాట్‌ఫామ్ 65 బృందాన్ని అభినందిస్తున్నాను అని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంఎల్‌ఏ దాస్యం వినయ్ భాస్కర్, ఎంఎల్‌సీ బండ ప్రకాష్ ; 30వడివిజిన్ కార్పోరేటర్ బోడ దిన్న సైతం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్లాట్‌ఫామ్ 65 (వరంగల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాల సుబ్రమణ్యం మాట్లాడుతూ, ఈ మైలురాయి వేడుక చేయడం పట్ల సంతోషంగా ఉన్నాము. వరంగల్‌కు ప్లాట్‌ఫామ్ 65 చేరుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. వరంగల్‌లో ఈ కాన్సెప్ట్ రెస్టారెంట్ అపూర్వ విజయం సాధిస్తుందని భావిస్తున్నాను. ఆధీకృత రుచుల ఆస్వాదనకు వరంగల్ వాసులను ప్లాట్‌ఫామ్ 65కు ఆహ్వానిస్తున్నాముఅని అన్నారు.