వరంగల్ నగరానికి మరో అరుదైన గుర్తింపు.. UNESCO నెట్‌వర్క్‌లో చోటు

మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (12:13 IST)
Warrangal
తెలంగాణలోని వరంగల్ నగరానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (UNESCO) గుర్తించిన అభ్యాసన నగరాల ప్రపంచ నెట్‌వర్క్‌లో వరంగల్ చోటు దక్కించుకుంది. 
 
ఇప్పటికే వరంగల్‌లోని ప్రఖ్యాత రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించిన సంగతి  తెలిసిందే. ఈ క్రమంలో ఏడాది వ్యవధిలోనే తెలంగాణలోని వరంగల్‌కు.. యునెస్కో నుంచి మరో గుర్తింపు లభించడం విశేషం.
 
యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో వరంగల్‌కు చోటు దక్కడంపై.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 
 
గ్లోబల్‌ నెట్‌వర్క్‌ ఆఫ్ లెర్నింగ్‌ సిటీస్‌లో వరంగల్‌కు చోటు లభించడంపై తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు