రైతులకి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది. అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడానికి, వారికి ఆర్థిక మద్దుతు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీమ్స్ లో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ స్కీమ్ (FPO) కూడా ఒకటి.
కంపెనీ చట్టం కింద దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ విత్తనలు, మందులు, ఎరువులు మొదలైన వాటిని రైతులకు విక్రయించొచ్చు. ఒక్కో ఎఫ్‌పీవోకు మోదీ సర్కార్ రూ.15 లక్షల రుణం అందిస్తుంది. దీని ద్వారా ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసుకొని పనులు ప్రారంభించొచ్చు. కేంద్రం 2023-24 నాటికి 10,000 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.